అనుష్క కోసం ప్రభాస్...మళ్ళీ మొదలుPrabhas anushka
2019-12-31 18:40:53

ఇండస్ట్రీలో పుకార్లకి అంతేం ఉంది. మనం వాటిని రోజూ చూస్తూనే ఉంటాం. అందులూ కొన్ని నిజమయితే కొన్ని పుకార్ల లాగే మిగిలిపోయ్తాయి. అలా మిగిలిన వాటిలో ఒకటి అనుష్క ప్రభాస్ ల పెళ్లి. అవును ఈ టాపిక్ మనం అందరం ఎన్నో మార్లు వినే ఉంటాం. అదేమీ లేదని ఇద్దరూ ఎన్నోమార్లు ప్రకటించినా ఈ పుకార్లకీ అంతూ పొంతూ ఉండదు. అయితే ఎవరేం అనుకున్నా వీరు ఇద్దరూ స్నేహితుల్లా మెలుగుతూ ఉంటారు. ఆ స్నేహ బంధంతోనే అనుష్క సినిమాకి ప్రమోట్ చేసి పెట్టే పనిలో పడ్డాడు ప్రభాస్. 

“భాగమతి ” మూవీ తరువాత స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “నిశ్శబ్ధం” మూవీ జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. అమెరికా లోని సియోటెల్ లోనే సినిమా మొత్తం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందిన ఈ మూవీలో మ్యూట్ ఆర్టిస్ట్ సాక్షిగా అనుష్క నటించారు. ఈ “నిశ్శబ్ధం” మూవీ తెలుగు, తమిళ, మలయాళ, ఇంగ్లీష్, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

”నిశ్శబ్ధం” మూవీ టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకొని మూవీ పై అంచనాలు పెంచగా ఈ సినిమాని మరింత ప్రమోట్ చేసి జనాలకి చేరువ చేసేందుకు ఏర్పాటు చేయనున్న నిశ్శబ్ధం మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాల్గొంటారని చెబుతున్నారు. ఇంకేం ఉంది ఈ పుకార్ల రాయుళ్ళకి మరో పెళ్లి అదేనండీ మరో మారి పెళ్లి వార్తను వాడుకునే అవకాశం దక్కింది.

More Related Stories