యాంకర్ ప్రదీప్ సినిమా రేర్ ఫీట్..సరికొత్త రికార్డ్Pradeep Machiraju
2020-06-04 11:36:52

తెలుగు బుల్లితెర మీద తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు. చిల్లర మాటలు లేకుండా హుందాగా ఉంటూ, తనదైన శైలిలో ఆకట్టుకునే యాంకర్ గా అతడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం తెలుగులో పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాప్ యాంకర్ అతడు. అయితే తాజాగా ప్రదీప్ హీరోగా ఒక సినిమా కూడా చేశారు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా అనే అసిస్టెంట్ ఈ మూవీ ద్వారా డైరక్టర్‌గా పరిచయం అవుతున్నారు. 1947 నాటి పీరియాడిక్ కథతో తెరకెక్కతోన్న ఈ సినిమా పేరు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ సినిమాలోని  'నీలి నీలి ఆకాశం ఇద్దామ‌నుకున్నా' పాట యూట్యూబ్‌ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. వినసొంపుగా ఉన్న ఈ పాట 150 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసి, చిన్న సినిమాల పాట‌ల్లో ఈ రేర్ ఫీట్ సాధించిన సాంగ్‌ గా కొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమాని ఎస్వీ ప్రొడక్షన్స్‌ బ్యాన‌ర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. అనుకున్న ప్రకారం ఉగాది కానుకగా మార్చి 25న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి మరి. 


 

More Related Stories