అద్దెకు ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్Prakash Raj Farm House
2020-12-09 16:39:52

నటుడు ప్రకాష్ కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టారు. తన ఫామ్ హౌస్ ను అద్దెకు ఇచ్చి డబ్బు సంపాదించే నిర్ణయం తీసుకున్నారు. "లైఫ్ ఎట్ ప్రకాశం" పేరుతో ఈ ఫామ్ హౌస్ ను నిర్మించారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి 30 నిముషాలు...నగరం నుండి గంట ప్రయాణం చేస్తే ఈ రిసార్ట్స్ కు చేరుకోవచ్చు. హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉన్న ఈ ఫామ్ హౌస్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. బర్త్ డే పార్టీలకు, చిన్నపాటి ఫంక్షన్లకు ఈ రిసార్ట్స్ ఎంతో బాగుంటాయి. అంతే కాకుండా రిసార్ట్స్ కు వచ్చిన వారికి ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది. శాకాహారం మరియు మాంసాహారం రెండు అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉండగా విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాల్లో ప్రకాష్ రాజ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు రాజీకీయాల్లోను ప్రకాష్ రాజ్ ఎప్పడూ యాక్టివ్ గా ఉంటూ తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటాడు. ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచాడు. 
 

More Related Stories