టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ పార్టీ..Prakash raj
2019-12-28 22:59:28

సినిమా ఇండస్ట్రీలో పార్టీలు అనేది సర్వసాధారణం. ఎప్పటికప్పుడు ఎవరికి వారు పార్టీలు చేసుకుంటూనే ఉంటారు. హీరో హీరోయిన్లు కూడా తమ రిలేషన్ కోసం రెగ్యులర్ గా పార్టీ కల్చర్ కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఒక పెద్ద పార్టీ జరిగింది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ లో ఈ పార్టీ అత్యంత ఘనంగా జరిగింది. క్రిస్మస్ సందర్భంగా రంగ మార్తాండ టీంతో కలిసి ప్రకాష్ రాజ్ అదిరిపోయేలా ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షాద్ నగర్ సమీపంలో ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ ఉంది. ఐదు ఎకరాల ఫామ్ హౌస్ లో  కృష్ణవంశీతో సహా ప్రకాష్ రాజ్ కు దగ్గర అనుకున్న స్టార్స్, డైరక్టర్స్, ఇండస్ట్రీ మిత్రులు ఈ పార్టీలో కనిపించారు. అలాగే ఓ ఫేడెవట్ అయిన హీరోయిన్ తో కలిసి మరో ఇద్దరు ఇండస్ట్రీ అమ్మాయిలు ఈ పార్టీలో హంగామా చేసారు. ఈ పార్టీ కోసం ప్రకాష్ రాజ్ రెండు రోజుల ముందునుంచే ప్రణాళిక సిద్ధం చేశాడు. తనకు కావాల్సిన వాళ్లందరినీ ప్రత్యేకంగా ఈ పార్టీకి ఆహ్వానించాడు. ఒక రాత్రంతా ఈ పార్టీ జరిగింది అంటే అది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వీళ్లంతా ఫుల్లుగా మద్యం సేవించి పాడిన పాటలు చేసిన డాన్సులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి ప్రకాష్ రాజ్ పాటలు పాడాడు. రంగ మార్తాండ సినిమాతో రాహుల్ నటుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బ్రహ్మానందం డిఫరెంట్ క్యారెక్టర్ చేయనున్న ఈ సినిమాను రెడ్ బల్బ్ మూవీస్, ఎస్వీఆర్ గ్రూప్, హౌస్‌ఫుల్ మూవీస్ బ్యానర్స్‌పై.. అభిషేక్ జవకర్, మధు కలిపు నిర్మించనున్నారు. 'నటసామ్రాట్' అనే మరాఠీ సినిమాకు 'రంగమార్తాండ' అఫీషియల్ రీమేక్. మొత్తానికి ఏదేమైనా తన స్నేహితులతో కలిసి ప్రకాష్ రాజ్ చేసుకున్న పార్టీ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.

More Related Stories