చిక్కుల్లో ప్రకాష్ రాజ్...ఏమవుతుందో ?prakash
2019-08-25 08:55:15

విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న్ ప్రకాష్ రాజ్ తాజాగా చిక్కుల్లో పడినట్టు చెబుతున్నారు. ఈయన సినిమాల్లో అన్ని రకాల పాత్రలు పోషించినా బయట మాత్రం ఆయన శైలి అన్నింటా వివాదాస్పదంగానే ఉంటుంది. ఆయన పర్సనల్ జీవితం మొదలు, రాజకీయ వ్యాఖ్యలు దాకా అన్నింటా ఆయన ఏదో ఒక రకమైన విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా ఆయనకి లీగల్ చిక్కులు ఎదురయ్యాయని అంటున్నారు. ఆయన గతంలో దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన సినిమా ఉలవచారు బిర్యానీ, ఈ సినిమాని ఆయనే ఇప్పుడు మళ్ళీ తడ్కా అనే పేరుతో బాలీవుడ్ లో దర్శకత్వం వహిస్తు తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమా మొదట మలయాళంలో 'సాల్ట్ అండ్ పెప్పర్' అండ్ పెప్పర్ పెరుతి తీశారు. నిజానికి ఆయన ఈ సినిమాను ప్రముఖ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ జీ గ్రూప్ వారి ఎస్సెల్ విజన్ తో కలిసి నిర్మించేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం బడ్జెట్లో కొంత భాగంగా గా 4.5 కోట్ల రూపాయలను ఆయన వారికి చెల్లించారు. కానీ ఆయన ఇంకా చాలా మొత్తం ఇవ్వాల్సి ఉందని వారు  హైకోర్టును ఆశ్రయించారు  .
అన్ని రకాలా ఖర్చులు కలిసి అది కాస్త 5.88 కోట్ల రూపాయలకు చేరిందని సదరు సంస్థ వాదన. ఎన్ని సార్లు ఆ బాకీ గురించి అడిగినా సరయిన స్పందన లేకపోవడంతో ఆ గ్రూప్ వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ప్రకాష్ రాజ్ ను ఆ మొత్తాన్ని చెల్లించమని ఈ ఏడాది ఏప్రిల్ లోనే చెల్లించాలని ఆదేశించారు. దానికి ప్రకాష్ రాజ్ అప్పటి అయితే కష్టమని జులైకి అయితే చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. అయితే జూలై దాటి ఆగష్టు నెలాఖరు వచ్చినా ఆయన డబ్బులు చెల్లించలేదు. అయితే ఈ అమౌంట్ లో సగం అంటే రెండు కోట్ల రూపాయల చెక్ ను ఎస్సెల్ వారికి ప్రకాష్ రాజ్ ఇచ్చారట. అయితే డబ్బు రాకపోవడంతో సదరు సంస్థ మళ్ళీ కోర్టుకు వెళ్ళింది. ఈ క్రమంలో వాదనలు విన్న కోర్టు ఈ రూ. 2 కోట్ల చెక్ కనుక బౌన్స్ అయిన పక్షంలో ప్రకాష్ రాజ్ చర్యను కోర్టు ధిక్కారం కింద పరిగణిస్తామని, తద్వారా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే ఆ సస్మ్త తమకు రావాల్సిన మొత్తం డబ్బును ప్రకాష్ రాజ్ చెల్లించేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ గడువు ఇచ్చారని కూడా అంటున్నారు. చూడాలి ఏమవుతుందో ?

More Related Stories