ప్రణీత చేస్తున్న సాయం చూసి చాలా మంది సిగ్గు పడాల్సిందే..Praneetha
2020-04-27 14:38:17

అవును నిజమే.. అక్షయ్ కుమార్ మాదిరి ఆమె కోట్లకు కోట్లు విరాళం అందించలేదు.. రాఘవ లారెన్స్ లా శక్తికి మించిన సాయం అయితే చేయలేదు.. మిగిలిన హీరోల మాదిరి కోట్ల రూపాయలు దానం చేయలేదు.. కానీ అందరికంటే మిన్నగా పనులు మాత్రం చేస్తుంది. అందరూ చేతులెత్తి దండం పెట్టాల్సినంత మంచి పని అయితే చేస్తుంది. అత్తారింటికి దారేది సినిమాతో సెకండ్ హీరోయిన్ గా.. బాపు బొమ్మగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిన ప్రణీత ఈ లాక్ డౌన్ సమయంలో చేస్తున్న పనులు చూసి ఈమెకు మరింత మంది అభిమానులు వచ్చారు. ప్రణీత చేస్తున్న సాయం చూసిన తర్వాత మన హీరోలతో పాటు ఇంకా చాలా మంది సిగ్గు పడాల్సిందే. రూపాయి ఇచ్చి కోటి రూపాయల ప్రమోషన్ చేసుకుంటున్న ఈ రోజుల్లో.. ప్రణీత మాత్రం లక్షల మంది కడుపు నింపుతూ కూడా కామ్ గా ఉంటుంది.

ఎలాంటి ప్రమోషన్స్ కూడా చేసుకోవడం లేదు. తనకు చేతనైన సాయం చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్లు ఎవరూ ముందుకు రాక ముందే 2 లక్షల రూపాయలని ఇచ్చి తన గొప్ప మనసు చాటుకుంది ఈమె. తర్వాత తన కిరాణంతో పాటు నిత్యవసర వస్తువులు కూడా పంపిణీ చేయడం మొదలు పెట్టింది. ఇక గత 25 రోజులుగా దాదాపు లక్ష మందికి భోజనం పెట్టింది ప్రణీత. ఇంకా పెడుతూనే ఉంది. కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటే కాదు.. దగ్గరుండి పేదల కడుపు నింపడంలోనే ఈమె ఎంతో సంతృప్తి వెతుక్కుంటుంది. నిజంగానే ప్రణీత చేసిన పని చూసిన తర్వాత ఆమెకు సలాం చేయకుండా ఎవరూ ఉండలేరు.

More Related Stories