పబ్ బిజినెస్ కు ప్రణీత గుడ్ బై.. అసలు కారణం ఇదే.. Pranitha
2020-05-07 16:46:34

చాలా రోజులుగా సినిమా ఇండస్ట్రీలో ప్రణీత పేరు కనిపించడం లేదు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఎక్కువగా వినిపిస్తుంది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో పేదలకు సాయం చేస్తూ వాళ్ళ కడుపు నింపుతూ వార్తల్లో నిలుస్తుంది ప్రణీత సుభాష్. తాను చేస్తున్న పనులతో అందరితో శభాష్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈమె తన పబ్ బిజినెస్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు సినిమాలతో పాటు వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. 

రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, కాజల్, అనుష్క శర్మ లాంటి నటీమణులంతా వ్యాపారాల్లో రాణిస్తున్నారు. అదే కోవలో ప్రణీత కూడా కొంతకాలం నుంచి బిజినెస్ చేసుకుంటుంది. 2015లో ప్రణీత బెంగుళూరులో పబ్ బిజినెస్ లో భాగస్వామి అయింది. బూట్ లెగ్గర్ అనే పబ్ లో ప్రణీత భాగస్వామి. అయితే ఇప్పుడు ప్రణీత ఆ బిజినెస్ నుంచి తప్పుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. త్వరలో కొత్త వ్యాపారం ప్రారంభించే ఉద్దేశంలో తాను ఉన్నట్లు ప్రణీత చెప్పుకొచ్చింది. కేవలం వ్యాపారాలతోనే తాను బతకడం లేదని.. కాకపోతే బిజినెస్ చేయాలనే కోరిక మాత్రం తనకు ఎప్పటి నుంచో ఉండేదని ప్రణీత తెలిపింది. ఆత్మ సంతృప్తి కోసమే బిజినెస్ చేస్తున్నట్లు ప్రణీత క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ భామ మొదలు పెట్టబోయే కొత్త బిజినెస్ ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

More Related Stories