ప్ర‌తి రోజు పండ‌గే ఫ‌స్ట్ లుక్ : మళ్ళీ మార్చారే  Prati Roju Pandage
2019-09-12 11:29:56

ఎన్నో సినిమాలతో విక్రమార్క ప్రయత్నం చేశాక సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన “చిత్రలహరి” సినిమాతో హిట్ కొట్టి ఫ్లాప్ ల పరంపరకి బ్రేక్ వేశాడు. ఆ సినిమా సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న ఆయన దర్శకుడు మారుతితో “ప్రతీ రోజు పండగే అనే విలేజ్ బేస్డ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఈ సినిమా నుండి తాజాగా ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో గొడుగు పట్టుకున్న స‌త్య‌రాజ్ జంప్ చేస్తుంటే తేజూ ప‌డిపోతావు అన్న‌ట్టుగా వెనక పరిగెడుతున్నట్టు ఈ మోషన్ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ సినిమాలో వీరిద్ద‌రు తండ్రి , కొడుకులుగా క‌నిపిస్తార‌ని ప్రచారం జరుగుతున్నా దాని మీద మాత్రం క్లారిటీ లేదు. చిత్ర ఫ‌స్ట్ లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. అయితే నిజానికి ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా ఈ సినిమా ప్లాన్ చేసినా సంక్రాంతికి ఉన్న పోటీ వలన దానికి ముందే అంటే డిసెంబర్ లోనే రిలీజ్ చేయనున్నట్టు ఈ పోస్టర్ లో క్లారిటీ ఇచ్చారు. థ‌మన్ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో స‌రికొత్త లుక్‌లో తేజూ క‌నిపించ‌నున్నాడు.

More Related Stories