రేటింగ్స్‌తో రప్ఫాడించిన ప్రతిరోజూ పండగే.. Prati Roju Pandage
2020-04-02 15:36:17

ఇప్పుడు ఇంట్లో కూర్చుని సినిమాలు చూడటం తప్ప మరో ఆప్షన్ లేదు. అందుకే మంచి సినిమాలు వస్తే కచ్చితంగా రేటింగ్స్ కూడా పేలిపోతాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ప్రతిరోజూ పండగే సినిమాతో రికార్డ్ రేటింగ్స్ తీసుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్. మా టీవీ ఈ సినిమాను టెలికాస్ట్ చేయగా ఏకంగా 15.3 టిఆర్పీ రేటింగ్స్ తీసుకొచ్చింది ప్రతిరోజూ పండగే. ఇది చూసి పండగ చేసుకుంటున్నారు చిత్ర యూనిట్. తమ సినిమా సాధించిన విజయాన్ని మరోసారి సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్లు. సాయి కెరీర్ లో ఇదే హైయ్యస్ట్ టిఆర్పీ.. అలాగే మారుతి కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ రేటింగ్స్ తీసుకొచ్చిన సినిమా. ఆ రోజు మరో స్టార్ హీరో సినిమా వచ్చినా కూడా ప్రతిరోజూ పండగే మాత్రం సత్తా చూపించింది. థియేటర్స్ లో కూడా ఈ చిత్రం దుమ్ము దులిపేసింది.

More Related Stories