హాట్ అందాలతో మతి పోగొడుతున్న హీరోయిన్ Priya Prakash Varrier
2020-10-17 20:34:27

ఒక్క టీజర్ తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. "ఒరు ఆధార్ లవ్" అనే సినిమా టీజర్ లో కన్ను కొట్టి దేశ కుర్రకారుని పడేసింది. ఏకంగా దేశ ప్రధానికి సైతం పరిచయం అయిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో దర్శకుడు సినిమాను అన్ని భాషల్లో విడుదల చేసాడు. అయితే సినిమా అన్ని భాషల్లోనూ ఫ్లాఫ్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే సినిమా విడుదలకు ముందే ప్రియా ప్రకాష్ వారియర్ కు ఎన్నో ఆఫర్ వచ్చాయి. కానీ సినిమా విడుదలయ్యాక సూపర్ హిట్ అవుతే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయవచ్చని హోల్డ్ లో పెట్టింది.   కానీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సీన్ రివర్స్ అయింది. ఈ భామ తెలుగులో నితిన్ "చెక్" సినిమాలో ఛాన్స్ కొట్టేసిందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు దానిపై స్పష్టత లేదు. ఇదిలా ఉండగా ప్రియా అప్పుడు కన్ను కొట్టి కుర్రకారు మతిపోగొట్టగా ఇప్పుడు హాట్ ఫోటో షూట్ లతో యువతకు మత్తెక్కిస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హాట్ అందాలను వడ్డించి మరోసారి ఈ భామ ఆఫర్లను దక్కించుకుంటుందా లేదా చూడాలి.

More Related Stories