విరాటపర్వం నుండి ప్రియమణి లుక్ రిలీజ్...కామ్రేడ్ భారతక్కగా Priyamani
2020-06-04 16:39:29

నీది నాదీ ఒకే కధ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి లీడ్ రోల్స్ లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే అనుకోకుండా వచ్చిన కరోనా ఈ సినిమా షూటింగ్ కి బ్రేకులు వేసింది. అయితే  ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా సాయి పల్లవి నక్సలైట్ గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో తన పాత్రలో ఈజ్ కోసం రానా రిటైర్డ్‌ పోలీస్‌ ఉన్నతాధికారి దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకునున్నాడని కూడా ప్రచారం జరిగింది. సాయి పల్లవి పాత్ర ఏమో జానపద గీతాలు పాడుతూ ప్రజలను చైతన్య పరిచే యువతిగా ఉంటుందట. ఇక భువనగిరిలో అత్యంత దారుణ హత్య కు గురైన బెల్లి లలిత పాత్రని పోలిన పాత్రలో ప్రియమణి నటిస్తోందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం మీద ఈరోజు క్లారిటీ ఇచ్చింది సినిమా యూనిట్. ఈరోజు ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

" మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో #ViraataParvam లో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం." అంటూ యూనిట్ ట్వీట్ చేసింది. నిజానికి ఈ సినిమాలో ట‌బుని మాన‌వ హ‌క్కుల కోసం పోరాడే జర్నలిస్ట్ పాత్ర కోసం తీసుకోవాల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించినా `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమా కోసం ఈ సినిమాని వదులుకుంది. అయితే ఆమె స్థానంలో బాలీవుడ్ న‌టి నందితాదాస్‌ ని అప్పుడే తీసుకున్నారు. ఆమెతో పాటు నటి ఈశ్వరి రావు, బాలీవుడ్ అలనాటి నటి జరీనా వహబ్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ప్రియమణి పేరు భారతక్క అని అనౌన్స్ చేయడంతో ఆమె పాత్ర లలిత పాత్ర ఏనా ? లేక మరో పాత్రా అనేది తేలాల్సి ఉంది. 

More Related Stories