హీరోయిన్లను సపోర్ట్ చేసిన ప్రియమణి.. వాళ్లడిగినంత ఇవ్వాల్సిందే..Priyamani.jpg
2019-10-15 09:53:21

దక్షిణాది హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ ప్రియమణి. ఒకప్పుడు వరస సినిమాలు చేసి.. జాతీయ అవార్డు కూడా అందుకుంది ఈ భామ. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయింది ప్రియమణి. ఇప్పటికీ అడపా దడపా సినిమాలు చేస్తున్నా కూడా పెద్దగా కనిపిస్తుంది మాత్రం లేదు. దాంతో బుల్లితెరపై జడ్జిగా సెటిల్ అయిపోయింది ప్రియ.

ఇక ఇప్పుడు ఈమె తన తోటి హీరోయిన్లు సమంత, నయనతార, అనుష్క క్రేజ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా వాళ్లకు సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేదని చెబుతుంది ఈమె. వాళ్లెంత పారితోషికం అడిగితే అంత ఇవ్వాల్సిందే అని.. ఎదురు చెప్పడానికి కూడా లేదని చెబుతుంది ప్రియమణి. వాళ్లతో పోలిస్తే మిగిలిన హీరోయిన్స్ కు అంత సీన్ లేదంటుంది ప్రియమణి. ఎందుకంటే వాళ్ల ఇమేజ్ తక్కువ అని.. సమంత, అనుష్క, నయన్ మాత్రం సపరేట్ మార్కెట్ ఉన్న హీరోయిన్లు అని చెబుతుంది ప్రియమణి.

ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే తమకు రావాల్సిన డబ్బును నిర్మాతల నుంచి ఖచ్చితంగా రాబడుతున్నారు.. మిగిలిన వాళ్లు మాత్రం చాలా మంది నిర్మాతల నుంచి పారితోషికం తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రియమణి తెలిపింది. ఈమె చెప్పిన లెక్క ప్రకారం అయితే నిర్మాతలు హీరోయిన్లకు సరిగ్గా రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని అర్థమైపోతుంది. ఇక మీటూ కూడా కేవలం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు.. అన్నిచోట్లా ఉంటుంది. అలాంటి భావన ముందు మనసులోంచి తీసేయాలని చెబుతుంది ప్రియమణి. 

More Related Stories