పబ్లిక్ ప్లేస్ లో రెచ్చిపోయిన ప్రియాంక నిక్ జంటPriyanka Chopra
2020-12-16 01:11:34

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పెళ్లికి ముందే తన బాయ్ ఫ్రెండ్ నిక్ జోనస్ తో కలిసి పబ్లిక్ ప్లేస్ లో రొమాన్స్ చేస్తూ మీడియా కంట పడింది. దాంతో వారి మధ్య ఉన్న రిలేషన్ షిప్ భయటకు పొక్కింది. కాగా పెళ్లి తరవాత ఈ జంట మరింత రెచ్చిపోతున్నారు. తరచూ ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలు..ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోలు సోషల్  మీడియాలో పెట్టి వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా  ప్రియాంక ప్రస్తుతం "టెక్స్ట్ ఫర్ యూ" అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా  షూటింగ్ కోసం లండన్ వెళ్లింది. కాగా లండన్ వీధుల్లో ఈ జంట ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం నిక్ కారులో ఓ పని చేశాడట. దాంతో ప్రియాంక చోప్రా నిక్ ను కారు నుండి బయటకు తోసేసిందట. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా ప్రచురించింది. ఇంతకీ నిక్ ఏం పని చేస్తే ప్రియాంక అంతలా రియాక్ట్ అయ్యిందో తెలియాలంటే ఆవిడే స్పందించాలి.

More Related Stories