కరోనా బాధితులకు అండగా ప్రియాంకా చోప్రా దంపతులు



 Priyanka Chopra
2021-05-24 13:28:11

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఆకలి చావులు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వ్యాపార వేత్తలు, సెలబ్రెటీలు ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనాస్ కూడా కలిసి భారత్ కు కరోనా రిలీఫ్ ఫండ్ ను అందజేస్తున్నారు. ఇప్పటికే దేశం కోసం వివిధ కార్యక్రమాల ద్వారా తాము రూ.7.5 కోట్ల సేకరించినట్టు తెలిపారు. 

అయితే భారత్ లో పరిస్థితి చూసి తాము ఇంకా ఎక్కువ విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. దానికోసం మొత్తం రూ.22 కోట్లు ఫండ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ప్రియాంకా వెల్లడించారు. దాని కోసం తన అభిమానులు కూడా సహాయం చేయాలని అనుకుంటే విరాళాలు పంపాలని కోరారు. టూ గెదర్ ఫర్ ఇండియా  పేరు తో తాము సేకరించిన విరాళాలను టీకాలు, ఆక్సీజన్ ల పంపిణీ కోసం ఖర్చు చేశామని అన్నారు. కరోనా 230 మిలియన్ల భారతీయులపై ప్రభావాన్ని చూపిందని అన్నారు. ఇది దేశంలో పోషకాహార లోపం పై ప్రత్యక్ష ప్రభావాన్ని చెప్పిస్తుందని ప్రియాంకా ఆవేదన వ్యక్తం చేశారు.

More Related Stories