వైట్ డ్ర‌స్ లో దేవ‌క‌న్య‌లా..!!priyankachopra-01
2018-07-03 20:42:12

ప్రియాంక చోప్రాను చూస్తుంటే ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. తెల్ల‌దుస్తుల్లో దేవ‌క‌న్య‌లా మెరిసిపోయింది ప్రియాంక‌. మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ కోసం మ్యాగ్జిమ‌మ్ రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు అస‌లు ఇండియ‌న్ హీరోయిన్ అనే మాటే ప్రియాంక చోప్రాకు న‌చ్చడం లేదు. పూర్తిగా ఈ ప్రాప‌ర్టీ హాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్క‌డ ఉంటూ అందాలు స‌ర్దుకుంటూ.. అవ‌కాశాలు అందుకుంటుంది. ప‌నిలో ప‌నిగా ఈ మ‌ధ్యే నిక్ జోన్స్ అనే ప్రియున్ని కూడా లైన్ లో పెట్టింది ప్రియాంక చోప్రా. త‌న‌కంటే ప‌దేళ్లు చిన్న‌వాడితో డేటింగ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

ఈ మ‌ధ్యే ఇండియాకు వ‌చ్చింది పిగ్గీచోప్స్. ప్రియుడితోనే త‌న కాల‌మంతా గ‌డిపేస్తుంది. మ‌ధ్య‌లో ఇలా మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ పై మెరిసింది. వైట్ డ్ర‌స్ లో ఎద అందాల‌న్నీ చూపిస్తూ మ‌తులు చెడ‌గొట్టేసింది ప్రియాంక‌. ఈ భామ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో స‌ల్మాన్ స‌ర‌స‌న భ‌ర‌త్ సినిమా ఒప్పుకుంది. అయితే అది మొద‌ల‌య్యే వ‌ర‌కు కూడా ప్రియాంక చోప్రా ఈ ప్రాజెక్ట్ లో ఉంటుందా లేదా అనే విష‌యంపై క్లారిటీ లేదు. మొత్తానికి హాలీవుడ్ భామ‌ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా దూకుడు చూపిస్తుంది ప్రియాంక చోప్రా.

More Related Stories