బాలయ్య వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన సి కళ్యాణ్..nbk
2020-05-29 02:45:26

ఇండస్ట్రీలో జరుగుతున్న మీటింగ్స్ గురించి తనకు తెలియదని.. తననెవరూ పిలవలేదని బాలయ్య చెప్పడం సంచలనంగా మారింది. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది.. బాలయ్య లాంటి స్టార్ హీరోను కూడా పిలవకుండా చిరంజీవి ఇంట్లో ఏం చేస్తున్నారంటూ అభిమానులు కూడా అడుగుతున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య వ్యాఖ్యలు కాంట్రవర్సీకి తెర తీస్తున్నాయి. ఇండస్ట్రీలో అంతా కలిసి బాలయ్యను ఒంటరిని చేసారంటూ వార్తలొస్తున్నాయి. ఇలాంటి తరుణంలో నిర్మాత సి కళ్యాణ్ ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. తాను స్వయంగా బాలకృష్ణకి ఫోన్ చేసి అసలు విషయమంతా వివరించినట్లు చెప్పాడు. తనకు కూడా సమస్యలపై స్పందించాలని ఉంటే రావాల్సిందని తెలిపాడు. ఇకపై మీటింగ్స్ ఏమైనా ఉంటే బాలయ్యను కూడా పిలుస్తామని చెప్పాడు.

అయితే ఇప్పట్నుంచి మీటింగ్ లు ఉండకపోవచ్చని చెప్తున్నాడు ఈయన. అక్కడ జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అనడం సరైంది కాదని చెప్పాడు కళ్యాణ్. తనకు అలా అన్పించిందేమో అని చెప్పుకొచ్చాడు సి కళ్యాణ్. ప్రస్తుతం నిర్మాతలుగా తాము షూటింగ్స్ అనుమతి కోసం ప్రభుత్వంతో మాట్లాడామని.. బాలకృష్ణ ఇప్పుడు నిర్మాతగా ఏ సినిమా చేయడం లేదు కాబట్టి అవసరమైనప్పుడు బాలయ్య తమతో చర్చల్లో పాల్గొంటాడని చెప్పాడు కళ్యాణ్. ఇప్పటి వరకు జరిగిన ప్రతీ విషయాన్ని బాలయ్యకు తానే స్వయంగా చెప్పానని గుర్తు చేసాడు సి కళ్యాణ్. ఇండస్ట్రీ అంతా ఒక్కటే అని.. ఇక్కడ ఎవరి మధ్య విభేదాలు లేవని.. గ్రూపు రాజకీయాలు లేవని చెప్పాడు ఈయన.

 

More Related Stories