నిర్మాతలకి ఓటీటీలతో కొత్త చిక్కులు

ఏ రంగమైనా కాలానికి అనుగుణంగా మారాల్సిందే. ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ జనరేషన్ కి తగ్గట్టు కొత్త మార్పులను అందిపుచ్చుకోవాలి. లేకపోతే ఆడియన్స్ తో డిస్ కనెక్ట్ ఏర్పుడుతోంది. మారుతున్న గ్లోబలైజైషన్ తో సినిమా ఫీల్డ్ కూడా కొత్త పుంత్తలు తొక్కుతోంది. ఒక్కప్పుడు సినిమా కోసం థియేటర్ కి పరుగులు తీసిన ప్రేక్షకులు ఇప్పుడు కూర్చున్న చోటే సినిమాను ఆస్వాధిస్తున్నారు. టెక్నాలజీ పుణ్యమా అని సినిమా నెట్టింట్లో నుండి నట్టింట్లోకి వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే సినిమా అరచేతిలోకి వచ్చేసింది. సినిమాలను సైతం తలదన్నే రితీలో వెబ్ సిరీస్ లు ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. దీంతో ఫీల్మ్ మేకర్స్ మారుతున్న ఎంటర్ టైన్ మెంట్ కి అనుగుణంగా సరికొత్త ఆలోచనలతో ఆడియన్స్ కి గాలం వేస్తున్నారు. ఇక ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే సినిమా కంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్’దే పై చేయి అయ్యే చాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. సినిమా థియేటర్ లో ఉండగానే టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్స్ లో చూసే అవకాశం కల్పిస్తున్నాయి. ఓటీటీలు ఆడియన్స్ ని టెంప్ట్ చేస్తున్నాయి. బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి.
అయితే సినిమా థియేటర్లో విడుదలైన కొన్ని వారాల తర్వాత ఓటీటీల్లో దర్శనమిచ్చే సినిమాలు కరోనా పుణ్యమా అని ఇప్పుడు థియేటర్లు మూతపడటంతో సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటి వరకు కొన్ని సినిమాలు ఓటీటీలో నేరుగా విడుదలవుతున్నాయి. అయితే మన తెలుగు విషయానికి వస్తే థియేటర్స్ ఉన్న కొందరు నిర్మాతలు ఎంత ఆలస్యమైనా తమ సినిమాలు థియేటర్స్‌లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే లాక్డౌన్ కు ముందు విడుదల తేదీలు ఫిక్స్ చేసిన నిర్మాతలు తమ సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్లను కూడా ఆయా ఒటీటీలతో ఫైనల్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు థియేటర్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని ఈ సమయంలో తమకు డైరెక్ట్ రిలీజ్ చేసుకునేలా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఒప్పందం ప్రకారం ఇచ్చిన సమయం కూడా దాటిపోయిందని అందుకే తమను డైరెక్ట్ రిలీజ్ చేయనివ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. దీంతో నిర్మాతలకు ఓటీటీ వారితో కొత్త చిక్కులు వచ్చాయని ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.