పృథ్వీని ఇండస్ట్రీ అనాధను చేసిందా Prudhviraj
2020-08-05 07:54:21

టాలీవుడ్ కమెడియన్, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ తీవ్ర అనారోగ్యంతో భాధపడుతూ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. గడిచిన రెండు వారాల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనకు ఎన్ని మందులు వాడిన తగ్గకపోవడంతో కరోనా టెస్ట్ కూడా చేయించుకున్నారు. అందులో కూడా నెగిటివ్ వచ్చినా జ్వరం తీవ్రమవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో క్వారంటైన్ చేసి ఆక్సిజన్ అందిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. వెంకటేశ్వర స్వామి దయ వల్ల బాగానే ఉన్నానని..త్వరగా కోలుకుంటానని ఆయన ఆ వీడియోలో తెలిపారు. 

అయితే నిన్న మొన్నటి వరకు బాగా ఫేమ్ లో ఉండి ఒక్కసారిగా లైంగిక వేధింపుల ఇష్యూతో ఆయన ఏకాకి అయినట్టు కనిపిస్తోంది. ఇండస్ట్రీలో పెద్ద తలకాయలు అయిన మెగా ఫ్యామిలీని, బాలయ్య ఫ్యామిలీని రాజకీయంగా కాక వ్యక్తిగతంగా కూడా పృథ్వీ టార్గెట్ చేయడంతో ఆయన్ని ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోలేదని అంటున్నారు. ఇక వీడు ఎటూ ఉపయోగపడడని భావించి అటు రాజకీయ నాయకులు కూడా ఆయన్ను వదిలేశారని అర్ధం అవుతోంది. భార్యతో ఎప్పుడో తెగతెంపులు అయ్యాయి. మరిప్పుడు బంధువులు ఎవరైనా అండగా ఉన్నారో ? లేదో  కానీ పృథ్వీ అలా వీడియో రిలీజ్ చేయడం భాద పెట్టిస్తోంది. ఆయన వీలయినంత త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. 
 

More Related Stories