బిగ్ బాస్ 4 విన్నర్లు వాళ్ళే.. రాహుల్ పున్నూ కామెంట్స్Punarnavi Bhupalam
2020-11-12 12:51:10

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ వారాలు గడుస్తున్న కొద్దీ ఆట కూడా కూడా ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికి బిగ్ బాస్ తొమ్మిది వారాలు పూర్తిచేసుకుని పదోవారం నడుస్తోంది. పదో వారానికి ఇంట్లో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. ఈ తొమ్మిది మందిలో ఈ వారం ఆరియనా,మహబూబ్,సోహల్, అభిజిత్,హారిక,మొనాల్ లు నామినేషన్ లో ఉన్నారు. అయితే ఇంకా టాప్ ఫైవ్ లోకి కూడా రాకుండానే ఫైనల్ విన్నర్ ఎవరనేదాని మీద చర్చ నడుస్తోంది. ఇన్ని వారాలు చూసినఅనుభవం తో కొంత మంది కొన్ని అంచనాలు వేస్తున్నారు. ఎవరు గెలుస్తారనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో పెరిగిపోయింది. అయితే ఈ ఆసక్తి సాధారణ అభిమానులకే కాక బిగ్ బాస్ కాంటెస్టెంట్స్ అయిన రాహుల్ సిప్లింగజ్,పునర్నవికి కూడా వుందని వారే తెలిపారు. రాహుల్ తన అభిప్రాయం ప్రకారం అభిజిత్ ఫైనల్ విన్నర్ అవుతాడని అనుకుంటన్నట్టు తెలిపాడు. 

కానీ అది కచ్చితంగా చెప్పలేమని వారం వారం గడిచే కొద్దీ అంచనాలు తారుమారు అవుతాయని ఏదైనా జరగవచ్చు అని తెలిపారు. ఇక పునర్నవి కూడా అభిజిత్ కే ఇప్పుడున్న పరిస్తుతుల్లో గెలిచే అవకాశం ఎక్కువ ఉందని తెలిపింది. తనకి ఈ సిజాన్ లో ఇష్టమైనవారు అభిజిత్, అవినాష్, నోయెల్ అని కానీ నోయల్ ఇప్పటికే ఎలిమినేట్ కాగా అభిజిత్, అవినాష్ లలో ఎవరో ఒకరూ గెలవాలని కోరుకుంటున్నటుగా తెలిపింది. వీరిద్దరి అభిప్రాయాలు మరోసారి బిగబాస్ ద్వారా  కలిసినట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా వీరి అభిప్రాయాలు ఎలా ఉన్నా వారం వారం గడిచే కొద్దీ మారుతున్న ప్రణాళికల్తో ఎవరు విన్నర్ అవుతారో చూడాలి.

More Related Stories