ప్యాన్ ఇండియా సినిమాల్లోనూ పూరి మార్క్Puri Jagan
2020-10-29 17:39:17

ప్రస్తుతం సినీపరిశ్రమలో ప్యాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. బాహుబలి, కేజీఎఫ్ సినిమా తరువాత దర్శకులు, హీరోలు ప్యాన్ ఇండియా చిత్రాలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం "పుష్ప, ఆర్ఆర్ఆర్" సినిమాలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుడా విజయ్ దేవరకొండ తో "ఫైటర్" అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కూడా పూరీ ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. అయితే మిగతా ప్యాన్ ఇండియా సినిమాలకు భిన్నంగా "ఫైటర్" సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. 

ప్యాన్ ఇండియా సినిమాలను ఇతర దర్శకులు 150 నుండి 200 కోట్ల పైనే బడ్జెట్ తో నిర్మిస్తుండగా పూరీ మాత్రం ఫైటర్ ను కేవలం రూ.50 కోట్ల నుండి రూ.70 కోట్ల బడ్జెట్ తో మాత్రమే నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నప్పటికి తక్కువ బడ్జెట్ తో నిర్మించడం విశేషం. అయితే ఇప్పటికే ఈ సినిమాకు హిందీ పరిశ్రమలో రూ.20 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిసినెస్ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక బయ్యర్లు ఈ సినిమాను ఎంత పెట్టింకొంటారో తెలియాల్సి ఉంది. ఇక ఫైటర్ సినిమా హిట్ అయితే పూరీ స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోవడం కాయం. అంతే కాకుండా బాలీవుడ్ హీరోలు సైతం పూరీతో సినిమాలు చేయడానికి క్యూ కడతారు.

More Related Stories