మళ్ళీ గొప్ప మనసు చాటుకున్న పూరీ Puri Jagannadh
2019-09-27 15:25:35

క్రేజీ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ ఇప్పుడు మంచి జోష్‌లో ఉన్నాడు. తానే స్వయంగా నిర్మిచిన ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన పూరి ఇప్పటికే కొత్త కారు కొని ఆనందంలో ఉన్నాడు. న్న పూరి ఇప్పుడు తన పుట్టిన రోజును పురస్కరించుకొని తన ఆనందాన్ని మరింత మందికి పంచేందుకు రెడీ అవుతున్నారు. అయితే రేపువ పూరీ జ‌గ‌న్నాథ్ బ‌ర్త్‌డే కావడంతో ఆయ‌నొ మంచి నిర్ణ‌యం తీసుకున్నారు. గతంలో దర్శకత్వ శాఖలో పనిచేసి ప్రస్తుతం అవకాశాలు లేని వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తన వంతుగా 20 మంది ఈ ఏడాది ఆర్థిక సాయం చేస్తున్నట్టుగా ప్రకటించారు. 

అంతేకాదు పరిస్థితులు అనుకూలిస్తే ప్రతీ ఏడాది ఇలాగే సాయం చేస్తామని ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పూరి జగన్నాథ్‌, చార్మీ కౌర్‌ ల పేరిట ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు ప్రసాద్ ల్యాబ్స్ లో పూరీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సినిమాతో మ‌మేక‌మై ఉండే ప్ర‌తి ఒక్క‌రి జీవితం బాగుండాల‌ని భావించిన పూరీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని బీయే రాజు ట్వీట్ చేయగా దానికి గ‌తంలో కూడా పూరీ ఇలాంటి సాయాలు చేసార‌ని బ్ర‌హ్మాజీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా రీత్వీట్ చేశారు. ఇక ఆ ఇది సాయం కాదని చిన్న చిరునవ్వు లాంటి పలకరింపు మాత్రమే. ఇది మీకు ఎలాంటి ఊరటనిచ్చినా మాకు సంతోషమే. మా దగ్గర శక్తి ఉన్నంత కాలం ప్రతీ సంవత్సరం మా ప్రయాణంలో ఇలాంటి పలకరింపులు ఉంటాయని పూరీ తన గొప్ప మనసు చాటుకున్నాడు.
 

More Related Stories