రెండు పార్టులుగా పుష్ప‌..క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత‌ Pushpa
2021-05-12 11:20:56

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం హీరోగా న‌టిస్తున్న సినిమా పుష్ప‌. ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్ గా న‌టిస్తోంది. అంతే కాకుండా సినిమాలో అల్లు అర్జున్ కు విలన్ గా మ‌ల‌యాళ హీరో ఫ‌హ‌ద్ ఫాజిల్ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంపై ఓ ఆస‌క్తిక‌ర వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాను రెండు పార్ట్ లుగా విడుద‌ల చేస్తార‌ని కొంత కాలంగా ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. 

అంతే కాకుండా ఈ సినిమాకు అనుకున్న బ‌డ్జెట్ కంటే 50 శాతం ఎక్కువ అవుతుంద‌ని కాబ‌ట్టి వ‌ర్కౌట్ అవ్వాలంటే రెండు పార్టులుగా విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ విష‌యంపై క్లారిటీ వ‌చ్చేసింది. పుష్ప నిర్మాత‌ల్లో ఒక‌రైన ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా విడుద‌ల చేస్తున్నట్టు స్ప‌ష్టం చేశారు. పుష్ప సినిమాను రెండు గంట‌న్న‌ర లో చెప్ప‌లేమ‌ని అన్నారు. అందువ‌ల్లే సినిమాను రెండు భాగాలుగా విడుద‌ల చేయాల‌ని అల్లు అర్జున్ సుకుమార్ తో క‌లిసి తాము నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. 

అంతే కాకుండా ఇప్ప‌టికే ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్ పూర్తైంద‌ని తెలిపారు. సెకండ్ పార్ట్ కూడా 10 శాతం షూట్ పూర్త‌యింద‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా టాలీవుడ్ లో ఇప్ప‌టికే రెండు పార్టులుగా విడుద‌లైన బాహుబ‌లి సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. మ‌రోవైపు కేజీఎఫ్ సినిమా కూడా రెండు భాగాలుగా విడుద‌ల‌వుతుంది.ఇక ఇప్పుడు పుష్ప కూడా ఆ లిస్ట్ లో చేరింది.

More Related Stories