జగన్ కి హాట్సాఫ్....అంటూ వారికి చురకలు అంటించిన పీపుల్ స్టార్jagan
2019-11-28 05:17:22

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఇంగ్లీష్ మీడియం విద్యావిధానంపై ప్రశంసలు కురిపించారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నానన్న నారాయణ మూర్తి ఇంగ్లీషు మీడియం విధానాన్ని వ్యతిరేకించేవారికి చురకలేశారు. అలాగే జగన్ కు హ్యాట్సాఫ్ అంటూ పొగిడేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో  బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయిన ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ పథకాలు ఎంతో ఆదర్శవంతమైనవంటూ అభిప్రాయపడ్డారు. తెలుగు భాష కాపాడమంటున్న వారి ఇళ్లలో ఇంగ్లీష్‌ మాట్లాడుకుంటున్నారని, మాతృభాషలో విద్యాబోధన జరగాలంటూనే మరో పక్కన వాళ్ల పిల్లల్ని మాత్రం కార‍్పొరేట్‌ సూళ్లలో చదవిస్తున్నారని అన్నారు. మా తరంలో ఇంగ్లీష్‌ మీడియంలో చదివినవాళ్లు ఇప్పుడు కలెక్టర్లుగా పని చేస్తున్నారని తెలుగు మీడియంలో చదివితే బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్యూన్లు, బంట్రోతులు మాత్రమే అవుతారని ఆయన వ్యాఖ్యలు చేశారు.

More Related Stories