రారండోయ్ వేడుక చూద్దాం రివ్యూRa-Randoi-Veduka-Chuddam-Movie-Review-Rating
2017-05-26 12:15:23

సోగ్గాడే చిన్నినాయ‌నా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల‌. ఈ చిత్రం త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో రారండోయ్ వేడుక చూద్దాం తెర‌కెక్కించాడు క‌ళ్యాణ్. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది.. సోగ్గాడే మాదిరే వేడుక కూడా అదిరిపోయిందా.. అస‌లు ఈ సినిమా ముచ్చ‌ట్లేంటి..?

క‌థ‌ : కృష్ణ‌(జ‌గ‌ప‌తిబాబు), సంప‌త్ ప్రాణ స్నేహితులు. ఓ రోజు సంప‌త్ చెల్లి వేడుక జ‌రుగుతుండ‌గా స‌డ‌న్ గా కృష్ణ.. అత‌డి చెల్లిని తీసుకెళ్తాడు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య అగాధం ఏర్ప‌డుతుంది. అవ‌న్నీ మ‌రిచిపోయి సంప‌త్ త‌న కూతురు భ్ర‌మ‌రాంబ‌(ర‌కుల్)తో హాయిగా ఉంటాడు. ఆమెను ఓ పెళ్లిలో చూసి తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు శివ‌(నాగ‌చైత‌న్య‌). అక్క‌డ్నుంచి ఆమెతోనే త‌న జీవితం అని ఫిక్సైపోతాడు. కానీ భ్ర‌మ‌రాంబ మాత్రం శివ‌ను ప్రేమికుడిగా ఒప్పుకోదు. ఇదే స‌మ‌యంలో శివ‌.. త‌న శ‌త్రువు కృష్ణ కొడుకు అని సంప‌త్ కు తెలుస్తోంది. ఈ టైమ్ లో భ్ర‌మ‌రాంబ‌ను శివ‌కు ఇచ్చి పెళ్లి చేస్తాడా.. అస‌లేం జ‌రిగింది.. అస‌లు కృష్ణ‌.. సంప‌త్ చెల్లిని ఎందుకు తీసుకెళ్తాడు అనేది మిగిలిన క‌థ‌..

క‌థ‌నం : ఇద‌్ద‌రు ప్రాణ స్నేహితులు.. వాళ్ల కుటుంబాలు.. అనుకోకుండా అపార్థాలు.. ఏళ్ల పాటు మాట్లాడుకోకుండా ఉండ‌టం.. వాళ్ల కొడుకు వ‌చ్చి రెండు కుటుంబాల్ని.. ఇద్ద‌రు స్నేహితుల్ని క‌ల‌ప‌డం.. కొన్ని వంద‌ల సినిమాల్లో ఈ క‌థ చూసుంటాం. ఇప్పుడు రారండోయ్ వేడుక చూద్దాం కూడా ఇదే క‌థ‌తో తెర‌కెక్కింది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే నిన్నే పెళ్లాడ‌తా సినిమాను మ‌ళ్లీ తీసాడు క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల‌. కాక‌పోతే అది ట్రెండ్ సెట్ చేసిన సినిమా కాబ‌ట్టి దాంతో పోల్చ‌డం స‌రికాదు. నిన్నే పెళ్లాడ‌తా త‌ర‌హాలోనే రారండోయ్ మొద‌ల‌వుతుంది. సినిమా తొలి 20 నిమిషాలు పెళ్లి వేడుక‌లో స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతుంది. కానీ ఆ త‌ర్వాత చైతూ, ర‌కుల్ మ‌ధ్య వ‌చ్చే రిపీటెడ్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి.

ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ బాగుంది. ఎమోష‌న్స్ తో సినిమాను న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా జ‌గ‌ప‌తిబాబు, చైతూ మ‌ధ్య వ‌చ్చే సీన్స్ బాగున్నాయి. ఫ్యామిలీ క‌థ‌కే కామెడీ జోడించి మెప్పించే ప్ర‌య‌త్నం చేసాడు ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల‌. ఏ సీన్ చూస్తున్నా.. ఏదో ఓ సినిమా గుర్తుకు వ‌స్తుంటుంది. తెలిసిన కథ కావ‌డం ఈ సినిమాకు మైన‌స్. అయినా స‌రే.. త‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో అక్క‌డ‌క్క‌డా ఛ‌మ‌క్కులు పండించాడు క‌ళ్యాణ్. ముఖ్యంగా సెకండాఫ్ లో వ‌చ్చే బీచ్ సీన్ లో ర‌కుల్ ను చైతూ తిట్టే సీన్ అయితే అదిరిపోయింది. ఆ త‌ర్వాత క్లైమాక్స్ కూడా బాగుంది. ఓవ‌రాల్ గా రారండోయ్ ను బ్లాక్ బ‌స్ట‌ర్ కాక‌పోయినా.. ప‌ర్లేద‌నే దిశ‌గా న‌డిపించాడు క‌ళ్యాణ్ కృష్ణ‌.

న‌టీన‌టులు : నాగ‌చైత‌న్య‌, ర‌కుల్, జ‌గ‌ప‌తిబాబు, సంప‌త్, కౌస‌ల్య‌.. క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల‌ నాగ‌చైత‌న్య బాగా న‌టించాడు. ఈ త‌ర‌హా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ కొత్తే అయినా బాగానే ఒదిగిపోయాడు చైతూ. ఇక ర‌కుల్ అయితే మాయ చేసింది. త‌న న‌ట‌న ప్ల‌స్ అందంతో నిజంగానే రారండోయ్ కు పెద్ద అస్సెట్ గా మారింది. హీరో తండ్రిగా జ‌గ‌ప‌తిబాబు త‌న పాత్ర మేర‌కు బాగా న‌టించాడు. హీరోయిన్ తండ్రిగా సంప‌త్ అద‌ర‌గొట్టాడు. ఇక మిగిలిన కారెక్ట‌ర్స్ అన్నీ ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతుంటాయి. ఈ నాలుగు పాత్ర‌లు మిన‌హా.. ఎవ‌రికీ పెద్ద పాత్ర లేక‌పోవడం గ‌మ‌నార్హం. క‌థ మొత్తం వీళ్ల చుట్టూనే తిరుగుతుంది.

టెక్నిక‌ల్ టీం : రారండోయ్ వేడుక చూద్దాం టీం బాధ్య‌త‌ను త‌న భుజాల‌పై మోసాడు దేవీ శ్రీ ప్ర‌సాద్. ఈ సినిమాపై ఇంత హైప్ రావ‌డానికి కార‌ణం దేవీ మ్యూజిక్. పాట‌ల‌న్నీ బాగున్నాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్, త‌కిట త‌కిట‌, భ్ర‌మ‌రాంబ‌కు నచ్చేసాను పాట‌లైతే అదిరిపోయాయి. విసు సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్. సోగ్గాడే చిన్నినాయ‌నాతో పోలిస్తే ఈ సారి కాస్త త‌గ్గాడు క‌ళ్యాణ్ కృష్ణ‌. పాత క‌థ‌నే మ‌ళ్లీ తీసుకోవ‌డంతో తాను కూడా ఏం చేయ‌లేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. కాక‌పోతే ఉన్నంత వ‌ర‌కు త‌న ప్ర‌య‌త్నం బాగానే చేసాడు.

చివ‌ర‌గా : ఓవ‌రాల్ గా రారండోయ్ వేడుక చూద్దాం క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్.. విత్ స్మాల్ బోరింగ్ మూవెంట్స్..

Rating 3/5

More Related Stories