తెలుగు సినిమా చిత్రీకరణలో రాయ్‌లక్ష్మీకి ప్రమాదం.. హాస్పటల్‌ నుంచి డిశ్చార్జ్Raai Laxmi
2021-03-23 13:11:09

సాధారణంగా సినిమా చిత్రీకరణలో ఫైట్‌ స్వీకెన్సీలో హీరోలు తరచుగా ప్రమాదబారిన పడి గాయలపాలవుతున్న వార్తలు తరచుగా వింటుంటాం.. అయితే ఇందుకు భిన్నంగా  తాజాగా *ప్రముఖ కథానాయిక రాయ్‌లక్ష్మీ ఇదే విధంగా ఫైట్స్‌ చిత్రీకరణలో పాల్గొని స్వల్ప గాయాలతో బయటపడి. .తృటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకుంది. వివరాల్లోకి వెళితే ప్రముఖ కథానాయిక రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో  తెలుగులో ఓ  వైవిధ్యమైన చిత్రం రూపొందుతుంది. రోచిశ్రీ మూవీస్‌ నిర్మాణంలో రమణ మొగిలి దర్శకత్వంలో రూపొందుతన్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలవ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షూటింగ్‌లో రాయ్‌లక్ష్మీ,  విలన్‌లు ప్రదీప్‌రావత్‌, సీనియర్‌ నటుడు సురేష్‌, ఇతర 18 మంది ఫైటర్స్‌తో అండర్‌వాటర్‌ లో భారీగా చిత్రీకరిస్తున్న యాక్షన్‌ సీక్వెన్సీలో లక్ష్మీరాయ్‌కి కాలుకి గాయమైంది. ప్రముఖ హాస్పటల్‌లో చికిత్స పొందిన అనంతరం ఆమెక్షేమంగా, పూ ర్తి ఆరోగ్యంతో డిశ్చా్‌ర్జ్‌ అయినట్లుగా త్వరలోనే ఆమె చిత్రీకరణలో కూడా పాల్గొంటుందని చిత్రబృందం తెలిపింది.

More Related Stories