రాధ‌ రివ్యూ రేటింగ్Radha-Movie-Review-Rating
2017-05-12 14:32:42

వ‌ర‌స‌గా నాలుగు విజ‌యాల‌తో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో శ‌ర్వానంద్. శ‌త‌మానం భ‌వ‌తి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈయ‌న న‌టించిన సినిమా రాధ‌. మ‌రి ఆ సినిమా ఎలా ఉంది.. శ‌ర్వానంద్ కు మ‌రో విజ‌యాన్ని అందించిందా..?

క‌థ‌ : రాధాకృష్ణ‌(శ‌ర్వానంద్) కు చిన్న‌ప్ప‌ట్నుంచీ కృష్ణుడు అంటే పిచ్చి. ఓ స‌మ‌యంలో అత‌న్ని ప్ర‌మాదం నుంచి ఓ పోలీస్ ఆఫీసర్ కాపాడ‌తాడు. దాంతో ఆ కృష్ణుడే పోలీస్ అని మెంట‌ల్ గా ఫిక్సైపోతాడు రాధా. పెరిగి పెద్దైన త‌ర్వాత కూడా పోలీస్ అవ్వాల‌నుకుంటాడు.. అవుతాడు. క్రైమ్ రేట్ లేని ఊళ్లో ప‌డేస‌రికి నిరాశ‌లో ఉన్న రాధాకు ఆ ఊళ్లో రాధ‌(లావ‌ణ్య త్రిపాఠి) తో ల‌వ్ లో ప‌డ‌తాడు. ఆమె ప్రేమ ఫ‌లించి సంతోషంలో ఉన్న టైమ్ లోనే ట్రాన్స్ ఫ‌ర్ అయిపోతాడు రాధా. అక్క‌డ కాబోయే సిఎం సుజాత‌(ర‌వికిష‌న్) రాధా జీవితంలోకి వ‌స్తాడు. అప్ప‌ట్నుంచి అత‌డి జీవితం ఎలా మారిపోయింది.. అత‌డి వ‌ల్ల రాధ లైఫ్ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అనేది మిగిలిన క‌థ‌..

క‌థ‌నం : పోలీస్ డ్రామాల‌న్నీ చూడ్డానికి ఒకేలా ఉంటాయి. ఓ పొలిటిక‌ల్ లీడ‌ర్.. అత‌డ్ని ఆడుకునే పోలీస్ ఆఫీస‌ర్. క‌థ ఎలాంటిదైనా దీని చుట్టూనే ద‌ర్శ‌కులు క‌థ‌లు అల్లుకుంటారు. ఇప్పుడు కొత్త ద‌ర్శ‌కుడు చంద్ర‌మోహ‌న్ కూడా ఇదే చేసాడు. చిన్న‌ప్ప‌ట్నుంచే హీరోకు కృష్ణుడు ఎంత సెంటిమెంటో.. పోలీస్ డ్ర‌స్ కూడా అంతే అని బ‌లమైన అభిప్రాయం చూసే ప్రేక్ష‌కుల్లో క‌లిగించాడు ద‌ర్శ‌కుడు. దాంతో పోలీస్ డ్ర‌స్ కోసం హీరో ఏం చేసినా పెద్ద‌గా లాజిక్ లు ఉండ‌వు. కావాల‌ని క్రైమ్ ఏరియాకు ట్రాన్స్ ఫ‌ర్ చేయించుకోవ‌డం.. అక్క‌డ క్రిమిన‌ల్స్ ను ఏరి పారేయ‌డం.. ఇంట‌ర్వెల్ టైమ్ కు ఓ ట్విస్ట్ ఇవ్వ‌డం.. ఇలా ప‌క్కాగా ఓ ఫార్మాట్ లో వెళ్తోంది రాధా క‌థ‌. సెకండాఫ్ లోనూ పెద్ద‌గా ఊహించ‌ని ట్విస్టులు ఏమీ ఉండ‌వు. అంతా సాఫీగానే సాగిపోతుంది. కాక‌పోతే అన్నింటినీ కామెడీతో క‌వ‌ర్ చేసాడు ద‌ర్శ‌కుడు. సెకండాఫ్ మొద‌ట్లో కానిస్టెబుల్స్ చ‌నిపోయిన సీరియ‌స్ సీన్ న‌డుస్తుండ‌గానే.. నెక్ట్స్ సీన్ లోనే కామెడీ చేసాడు ద‌ర్శ‌కుడు. ఇలా సినిమాలో బోలెడ‌న్ని సీన్లు ఉన్నాయి. ఓవ‌రాల్ గా కామెడీతో పాస్ అయిపోవ‌డానికి సేఫ్ గేమ్ ఆడాడు చంద్ర‌మోహ‌న్.

న‌టీన‌టులు : శ‌ర్వానంద్, లావ‌ణ్య త్రిపాఠి, ర‌వికిష‌న్, కోట త‌దిత‌రులు క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌కుడు: చ‌ంద్ర‌మోహ‌న్  శ‌ర్వానంద్ తొలిసారి పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించాడు. బాగానే చేసాడు కూడా. కామెడీ పోలీస్ గా న‌వ్విస్తూనే.. కావాల్సిన చోట్ల సీరియ‌స్ పోలీస్ గా ర‌ప్ఫాడించాడు. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో టీ కొట్టు ద‌గ్గ‌ర పోలీస్ ను కొట్టిన‌పుడు వ‌చ్చే సీన్.. క్లైమాక్స్ లో పోలీసుల గురించి చెప్పే సీన్ లో శ‌ర్వానంద్ అద‌ర‌గొట్టేసాడు. లావ‌ణ్య త్రిపాఠి అందాల ఆర‌బోత‌కే స‌రిపోయింది. అక్ష ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయింది. ఇక విల‌న్ గా ర‌వికిష‌న్ రోల్ రేసుగుర్రం సినిమాను గుర్తు చేసింది. అక్క‌డా ఇక్క‌డ ప‌దవి కోసం పాకులాడే లీడ‌ర్ రోల్. కోట‌, త‌ణికెళ్ల భ‌ర‌ణి, శ‌క‌ల‌క శంక‌ర్, బ్ర‌హ్మాజీ.. ఇలా ఎవ‌రికి వాళ్లు త‌మ పాత్ర‌ల్లో మెప్పించారు.

టెక్నిక‌ల్ టీం : రాధా సినిమాకు పెద్ద మైన‌స్ రాధ‌న్ మ్యూజిక్. పాట‌లు బాగోలేవు. చూడ్డానికి బాగున్నా.. విన‌డానికి అస్స‌లు బాగోలేవు. అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. సినిమాటోగ్ర‌ఫీ ఓకే. ద‌ర్శ‌కుడిగా చంద్ర‌మోహ‌న్ పాస్ మార్కులు వేయించుకున్నాడు. తొలి సినిమా కావ‌డంతో రిస్క్ తీసుకోడానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ఫార్మాట్ క‌థ‌తో ముందుకెళ్లిపోయాడు. డైలాగ్స్ బాగానే రాసుకున్నాడు. అయితే స్క్రీన్ ప్లే లోపాల‌తో క‌థ ముందే తెలిసిపోతుంది. కామెడీతో వాటిని కవ‌ర్ చేయ‌డానికి చూసాడు చంద్ర‌మోహ‌న్.

చివ‌ర‌గా : ఈ రాధా ఒక్క‌సారి చూడ్డానికి ఓకే.. కానీ కొత్త క‌థ కావాలంటే మిగిలేది బాధే..

రేటింగ్ 3/5

More Related Stories