కోవిడ్ పేషెంట్స్ కోసం రాధేశ్యామ్ సెట్



Radhe Shyam
2021-05-10 17:59:49

ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభణతో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దాంతో ఆసుపత్రులు పేషంట్స్ తో నిండిపోయాయి. బెడ్లు దొరక్క ఎంతోమంది కరోనా బాధితులు ఇబ్బంది పడుతున్నారు. అయితే తాజాగా రాధే శ్యామ్ చిత్ర బృందం తమ షూటింగ్ కోసం ఉపయోగించిన భారీ ఆసుపత్రి సెట్ ను కోవిడ్ పేషంట్స్ కోసం దానం చేసినట్టు తెలుస్తోంది. అందులో 50 వరకు బెడ్స్, స్ట్రెచ్చర్స్, పీపీఈ కిట్లు, ఇతర మెడికల్ ఎక్యుప్మెంట్స్ ను దానం చేశారట. అంతే కాకుండా వాటితో పాటు కొన్ని ఆక్సిజన్ సిలిండర్ లను సైతం ఇచ్చేసినట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా రాధే శ్యామ్ సినిమాలో ఆస్పత్రిలో కొన్ని కీలక సన్నివేశాలు ఉండబోతున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో పూజా హెగ్డే మెడికల్ స్టూడెంట్ కాగా ప్రభాస్ హాస్పిటల్ కు వెళ్లిన సంధర్బంలోనే ప్రేమలో పడతారట. ఇక ఇప్పుడు షూటింగ్ పార్ట్ పూర్తవడంతో 9 ట్రక్కుల్లో సెట్ ప్రాపర్టీ ని ఆస్పత్రికి తరలించారట. ఇదిలా ఉండగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పిరియాడికల్ ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రాన్ని జులై 30 న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. కానీ కరోనా నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం అవ్వడంతో రిలీజ్ వాయిదా పడింది.

More Related Stories