రాధేశ్యామ్ సర్ ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్Radhe Shyam unveils the latest poster on the occasion of Janamashtami
2021-08-30 22:48:13

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంటగా నటిస్తున్న భారీ పిరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చేస్తున్నారు. అలాగే అప్ డేట్స్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే.. కృష్ణాష్టమి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. నెమలి పింఛాలతో కూడిన నీలి రంగు గౌనును ధరించిన పూజా హేగ్డే పియానో వాయిస్తుండగా, జెంటిల్ మ్యాన్ లుక్ లో ప్రభాస్ ఆ వైపు చిరునవ్వులను చిందిస్తూ ఆప్యాయంగా చూస్తున్న ఈ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ.. కథను మలుపు తిప్పే పాత్ర అని సమాచారం.  గోపీకృష్ణ మూవీస్ పతాకం పై రెబల్ స్టార్ కృష్ణం రాజు - టీ సిరీస్ భూషణ్ కుమార్ సమర్పణలో యూవి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రానికి వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మాతలు. ఇక ఈ మూవీ రిలీజ్ విషయానికి వస్తే... ఈ భారీ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. కుదరలేదు. జులై 30న ఈ సినిమాని విడుదల చేయాలి అనుకున్నారు. కరోనా సెకండవ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. జులై 30న కొత్త పోస్టర్ రిలీజ్ చేసి రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా 2022లో జనవరి 14న విడుదల కానున్నట్టుగా ప్రకటించారు.  

More Related Stories