నటి రాధిక కుమారస్వామికి క్రైమ్ బ్రాంచ్ నోటీసులు



Radhika Kumaraswamy
2021-01-08 17:09:34

మాజీ సీఎం రెండో భార్య, ఫేమస్ హీరోయిన్ రాధిక కుమారస్వామికి క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. రాజకీయ నాయకుల పేరుతో అనేక మందిని మోసం చేసి చీటింగ్ కేసుల్లో అరెస్టు అయిన నకిలి ఆర్ఎస్ఎస్ లీడర్ యువరాజ్ అలియాస్ యువరాజ్ స్వామి అలియాస్ స్వామి బ్యాంకు ఖాతాల నుంచి  రాధిక ఖాతాలోకి కోట్ల రూపాయల నగదు బదిలి అయ్యిందని గుర్తించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. దాంతో ఈ ఆమెకు కేసులో నోటీసులు జారీ చేశారు. 

శుక్రవారం రాధిక కుమారస్వామిని విచారణకు హాజరుకావాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చెయ్యడంతో మాజీ సీఎంతో పాటు ఆయన వర్గీయులు షాక్ అయ్యారు. భారత మాజీ ప్రధాన మంత్రి, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డీ. దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి ప్రముఖ నటి రాధిక ను రెండో పెళ్లి చేసుకున్నారు. హెచ్.డీ. కుమారస్వామి మొదటి భార్య అనితా కుమారస్వామి కూడా జేడీఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా చరుకుగా రాజకీయాల్లో ఉన్నారు.

యువరాజ్ స్వామి అలియాస్ స్వామిని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో యువరాజ్ స్వామి గురించి అనేక షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అతడి బ్యాంకు అకౌంట్ ల నుంచి కుమారస్వామి రెండో భార్య రాధిక కుమారస్వామి బ్యాంకు ఖాతాలకు భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దాంతో శుక్రవారం విచారణకు హాజరుకావాలని రాధిక కుమారస్వామికి బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు.

కాగా యువరాజ్ తో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు, రాజకీయ సంబంధాలు లేవని నటి రాధిక ఇప్పటికే వివరణ ఇచ్చారు. యువరాజ్ కుటుంబ సభ్యులకు 17 సంవత్సవరాల నుంచి పరిచయం ఉందని, ఆయనతో తనకు ఎలాంటి ఆర్థికలావాదేవీలు లేవని రాధిక స్పష్టం చేశారు. చారితాత్మక సినిమా నిర్మాణం కోసం యువరాజ్ రూ. 15 లక్షలు, మరో సినిమా నిర్మాత రూ. 60 లక్షలు తనకు అడ్వాన్స్ గా ఇచ్చారని ఆమె అంటున్నారు. ఇప్పటికే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాధిక కుమారస్వామి సోదరుడు రవిరాజ్ ను విచారణ చేసి వివరాలు సేకరించారు. మొత్తం మీద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అడిగే ప్రశ్నలకు రాధిక కుమారస్వామి వివరణ ఇవ్వడానికి సిద్దం కావాల్సి ఉంది.

More Related Stories