ఈ సమయంలో చిన్న సాయమైనా పెద్దదే  Raghava Lawrence
2020-05-02 13:37:34

కొరియోగ్రాఫర్ గా సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరో, దర్శకుడుగా సెటిల్ అయిన రాఘవ లారెన్స్ సాయం కోసం ఎదురు చూసే వారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. తన జీవితంలో ఎంతో మందికి సాయ పడిన ఆయన కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతోన్న సినీ కార్మికులు, పేదలు, సినీ నృత్యకళాకారులను ఆదుకోవడానికి ఇప్పటికే రూ.3 కోట్ల విరాళం కూడా ఇచ్చారు. ఆయన ప్రకటించిన 3 కోట్లలో పీఎం కేర్స్ ఫండ్, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్, ఎఫ్ఈఎఫ్ఎస్‌ఐ యూనియన్, డాన్సర్స్ యూనిన్లకు 50 లక్షల చప్పున అలాగే దివ్యాంగులకు 25 లక్షలు, తన స్వస్థలం రోయపురంలోని పేద ప్రజల కోసం 75 లక్షల సాయం అందజేస్తున్నట్టు లారెన్స్ స్పష్టం చేశారు. 

ఇక పేదలకు అందించడానికి వస్తు రూపంలో లారెన్స్ కొందరిని సాయం అడిగారు, ఆయన సాయం అడిగిన వెంటనే రజనీకాంత్‌ స్పందించారు. ఈ విషయాన్ని స్వయంగా పేర్కొన్న లారెన్స్ తన పిలుపుకు స్పందించి తొలిసారి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పందించి 100 బస్తాల బియ్యం పంపించారని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక అలాగే కమల్‌, అజిత్‌, విజయ్‌, సూర్య, ఇతర నటులు, రాజకీయ నేతలు కూడా సాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నానని లారెన్స్ పేర్కొన్నారు. ఈ సమయంలో మనం చేసే చిన్న సహాయమైనా పెద్ద అండగా ఉంటుందని లారెన్స్ చెబుతున్నారు.

More Related Stories