గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో ఛాన్స్ కొట్టేసిన రాహుల్ Rahul Ravindran
2021-06-14 13:46:44

తొలి సినిమాతోనే హిట్‌ కొట్టిన దర్శకుడిగా మారిన నటుడు రాహుల్‌ రవీంద్రన్‌. రెండో సినిమాకే నాగార్జునను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ కొట్టేశాడు. మన్మథుడు వంటి క్లాసిక్‌ హిట్‌కు సీక్వెల్‌గా తీసిన మన్మథుడు-2 బాక్స్‌ఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. దీంతో చాలా గ్యాప్‌ తీసుకున్న రాహుల్‌..ఈ మధ్యకాలంలో ఓ మంచి కథను సిద్ధం చేసుకున్నాడట.

లవ్‌ స్టోరీ కథాంశంతో తెరకెక్కనన్ను ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్‌లో నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికే బన్నీ వాసుకు కథ నచ్చడంతో ఈ మూవీని త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అయితే హీరో హీరోయిన్లు ఎవరు అన్నదానికపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

More Related Stories