రాజ్ తరుణ్ ఆశలన్నీ ఆ ఒక్క సినిమాపైనే..  Raj Tarun
2019-10-14 10:56:31

అసలే వరుస ఫ్లాపులతో ఎక్కడున్నాడో కూడా ప్రేక్షకులు మర్చిపోయే పరిస్థితికి వచ్చేసాడు కుర్ర హీరో రాజ్ తరుణ్. ఒకప్పుడు వరుస విజయాలతో ఇండస్ట్రీకి వచ్చినా.. తర్వాత అదే ఊపు కొనసాగించడంలో పూర్తిగా విఫలం అయ్యాడు.  అసలు రాజ్ తరుణ్ సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు పట్టించుకోవడం కూడా మానేశారు. దానికి తోడు వరుస పరాజయాలు పూర్తిస్థాయిలో ముంచేశాయి. ఆ మధ్య ఈయన నటించిన లవర్ సినిమా డిజాస్టర్ కావడంతో పట్టించుకునేవాళ్లు కరువైపోయారు. దానికి ముందు రంగులరాట్నం, రాజుగాడు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. దిల్ రాజు నిర్మించిన లవర్ సినిమా కూడా అంచనాలు నిలబెట్టకపోవడంతో రాజ్ తరుణ్ పూర్తిగా నటన మానేసి దర్శకత్వం వైపు వెళ్తున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ రాజ్ తరుణ్ కు ఎక్కడో సుడి ఉంది. అందుకే మళ్లీ దిల్ రాజు ఈయనతో ఓ సినిమా నిర్మిస్తున్నాడు. వరస డిజాస్టర్స్ లో ఉన్న రాజ్ తరుణ్ కు దిల్ రాజు సినిమా రావడం అనేది చిన్న విషయం కాదు.. కానీ వచ్చింది. ఐదేళ్ల కింద సుధీర్ బాబు హీరోగా ఆడు మగాడ్రా బుజ్జి సినిమా తెరకెక్కించిన కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా ఇద్దరి లోకం ఒకటే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. అక్టోబర్ 14న ఈ చిత్రంలోని తొలి పాట విడుదల కానుంది. శాలిని పాండే ఈ చిత్రంలో హీరోయిన్. కచ్చితంగా ఈ చిత్రంతో మళ్లీ తాను హిట్ కొట్టి చూపిస్తానంటున్నాడు రాజ్ తరుణ్. మరి ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీల్లోనే నిలుస్తున్న రాజ్ తరుణ్.. హిట్ కొడతాడో లేదో చూడాలిక. 

More Related Stories