రాజా వారు రాణి గారు మూవీ రివ్యూRaja Vaaru Rani Gaaru
2019-11-30 00:39:18

గత కొద్ది రోజులుగా ప్రేక్షకుల్లో బాగా నానుతున్న పేరు రాజా వారు రాణి గారు. టైటిల్ వైరైటీగా ఉండడమే కాక టీజర్ ట్రైలర్స్ కూడా బాగా ఆసక్తి కరంగా ఉండడంతో ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డ్డాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుండా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కథ:

రామపురం అనే ప‌ల్లెటూళ్ళో ఉండే రాజా (కిర‌ణ్‌)కి రాణీ (ర‌హ‌స్య గోర‌క్‌) అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి త‌న వెంటే తిరుగుతుంటాడు. కానీ ఆ ప్రేమను తెలియ చేయాలంటే చాలా భయం. అది స్కూల్ వయసు నుండి కాలేజ్ వయసుకు వచ్చినా మనోడి భయం అలానే ఉంటంది.  ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిపోతాయి. రాణిని ఇంజనీరింగ్ కోసమని వేరే ఊరు పంపిస్తాడు వాళ్ళ నాన్న. రాణి ఊరు విడిచివెళ్లేటప్పుడు రాజా వైపు చూసి టాటా అన్నట్టు చెయ్యి ఊపడంతో రాణి కూడా తనను ప్రేమిస్తుంది అని ఫీల్ అయ్యి ఆమె తనదే అనే భ్రమలో బ్రతికేస్తుంటాడు. అయితే మూడేళ్లయినా రాణి ఊళ్లోకి రాదు. కానీ ఎప్పటికయినా ఆమె వస్తుంది, తన ప్రేమని ఒప్పుకుంటుంది అని ఆశతో ఉంటాడు. ఆ ఎదురుచూపుల వల్ల అతనిలో ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతుంది. దాంతో రాజా స్నేహితులు అయిన నాయుడు, చౌదరి రాణిని ఊరికి రప్పించడానికి ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ సక్సెస్ అయ్యి రాణి ఊరికి తిరిగొస్తుంది. అయితే అలా వచ్చిన రాణికి రాజా తన ప్రేమని ఎలా తెలియజేసాడు?, అతని ప్రేమని ఆమె ఒప్పుకుందా?, లేదా? అనేదే కధ.

విశ్లేషణ :

'ఐలవ్యూ' అని ఒకరి కొకరు చెప్పుకొని కలసి బతకడమో, కలహాలతో విడిపోవడమో జరిగే ప్రేమ కథలు చాలా చూశాం. ఇక ఫస్ట్ రీల్ లోనే ఐ లవ్ యు చెప్పుకొని లిప్ లాక్ సీన్స్ లో మునిగిపోయే లవ్ స్టోరీస్ లేటెస్ట్ ట్రెండ్. కానీ అవతలి వ్యక్తికి తమ ప్రేమని  ఎక్స్ ప్రెస్ చేయని లవ్ స్టోరీస్ కూడా కొన్ని ఉంటాయి. అలాంటి ఓ కథే ఇది. చివరి రీల్ వరకు ఐ లవ్ యు చెప్పుకోడానికి ఆలోచించే ఈ తరహా ప్రేమకథలు ఈ మధ్య అసలు రావడం లేదు. కానీ ప్రేమించడం తప బయటపడటం రాని 'రాజా వారు, రాణీ గారు' అనే స్వచ్ఛమైన ప్రేమికుల కథ చెప్పాలనుకున్నాడు దర్శకుడు. ఆ  మూగ మనసుల ప్రేమకథని ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా చెప్పడానికి నాయుడు, చౌదరి  అనబడే జోకర్, బ్యాట్ మ్యాన్ ల హెల్ప్ తీసుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ప్రేమ, కొంచెం కామెడీ మేళవింపుతో మెప్పించిన దర్శకుడు సెకండాఫ్ లోనూ ఇదే ఫార్ములా కంటిన్యూ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో మెయిన్ ట్రాక్ అయిన లవ్ స్టోరీలో వేగం తగ్గింది. ఎమోషన్ సీన్స్ కోసం ప్రీక్షకులు క్లైమాక్స్ వరకు ఆగాల్సి వచ్చింది. సెకండాఫ్ పై కూడా  ఇంకొంత దృష్టి పెట్టి ఉంటే రిజల్ట్ మరో లెవెల్ లో ఉండేది. ఏదేమైనా అద్భుతమైన ప్రేమకథ అని చెప్పలేం కానీ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే  కడుపుబ్బా నవ్వుకుని పల్లెటూరి ప్రేమ జ్ఞాపకాలు ఏమైనా ఉంటే ఓసారి గుర్తు చేసుకుని రావచ్చు.

నటీనటులు :

ఈ సినిమాలో దాదాపు చాలా మందికి ఇదే మొదటి సినిమా. హీరో, హీరోయిన్, స్నేహితుల దగ్గరనుండి అందరూ కొత్త ముఖాలే. అయితే ఎవరూ ఇందులో కొత్త అనిపించేలా ఎవరూ నటించ లేదు. కిరణ్ అబ్బవరం నటన సరిగ్గా సరిపోయింది. రహస్య గోరఖ్ పర్వాలేదు. నిజానికి ఈ సినిమాలో ఆమె రోల్ చిన్నదే అని చెప్పాలి. పెర్ఫార్మన్స్ కు అసలు స్కోప్ రాలేదు. ఇక రాజా స్నేహితులుగా చేసిన రాజ్ కుమార్ కసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం ఇద్దరూ సినిమాలో కడుపుబ్బా నవ్విస్తారు. నేచురల్ డైలాగ్స్, కామెడీ వర్కవుట్ అయ్యాయి. మ్యూజిక్, కెమెరా వర్క్ ని డైరెక్ట జిక్, కెమెరా వర్క్ ని డైరెక్టర్ గట్టిగా వాడేసుకున్నాడు. హీరో హీరోయిన్ల మధ్య మూతి ముద్దులూ కలిసి తిరిగే సీన్స్ లేవు గనుక ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ద్వారా కామెడీ దట్టించాడు. కానీ ఈ ఫ్రెండ్స్ సీన్స్ కొన్ని చోట్ల రిపీట్ అయిన ఫీల్ కలిగింది.

ఫైనల్ గా : రాజా వారు రాణి గారు బూతు లేని స్వచ్చమైన పల్లెటూరి ప్రేమ కథ.

రేటింగ్: 2.75 /5.

More Related Stories