యాభై శాతం సీటింగ్ పర్మిషన్ సరికాదు ..రాజమౌళిRajamouli
2020-10-06 07:48:09

దర్శకధీరుడు రాజమౌళి లాక్ డౌన్ కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు. ఈ   క్రమంలోనే ఆయన కరోనా బారిన పడి కొలుకున్నారు కూడా. రాజమౌళి తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సైతం కరోనా పాజిటివ్ రాగా హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుని కరోనా ను జయించారు. కాగా తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు...ఆర్ఆర్ఆర్ షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ లో మొదలు పెడతామని అన్నారు. దానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ను కూడా ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలిపారు. ఇక ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారని దానిపై మీ అభిప్రాయం చెప్పండని అడగగా..ప్రభాస్ లాక్ అయిపోయాడని, అలాంటి సినిమాలు చేయడం తప్ప ప్రభాస్ కు వేరే దారిలేదని అన్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న ప్రభాస్ కొందరికి నచ్చే సినిమాలు మాత్రమే చెయ్యడం కుదరదని చెప్పారు. ఆదిపురుష్ సినిమా గురించి ప్రభాస్ చర్చించాడా అని ప్రశ్నించగా..చర్చించారు కానీ నేను ఆ సినిమా గురించి మాట్లాడానని అన్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్ టీజర్ ఎప్పుడు విడుదల అవుతుందని ప్రశ్నించగా సిద్ధం చేస్తున్నాం, త్వరలోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా థియేటర్ల ఓపెనింగ్ పై రాజమౌళి ఆశక్తికర కామెంట్లు చేశారు. విమానాల్లో గంటల తరబడి ప్రయాణించడాని అనుమతిచ్చారు. కానీ థియేటర్ లో 50 శాతం సీటింగ్ కి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించారు.

More Related Stories