బందిపూర్ అడవిలో రాజమౌళి.. సతీ సమేతంగా అక్కడే..Rajamouli
2020-09-19 02:26:00

రాజమౌళి ప్రస్తుతం సినిమాల నుంచి పూర్తిగా బ్రేక్ తీసుకున్నాడు. ఎలాగు కరోనా వైరస్ బయట విజృంభిస్తుండడంతో ఇప్పట్లో షూటింగ్ చేసే ఉద్దేశం కూడా ఆయనకు లేదు. దసరా తర్వాత మిగిలిన కార్యక్రమాలు చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. అందుకే అప్పటి వరకు ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన సతీసమేతంగా కర్ణాటకలోని బందిపూర్ అడవులకు వెళ్ళాడు. గత రెండు మూడు రోజులుగా అక్కడే ఉన్నాడు. దానికి ఒక కారణం ఉంది. ఈ మధ్య రాజమౌళి కుటుంబం కరోనా బారిన పడింది. చిన్న పెద్ద ముసలి ముతక అందరూ వైరస్ బారిన పడి 20 రోజుల్లో కోలుకున్నారు. అందరికీ నయం అయిన తర్వాత కర్ణాటకలోని గోపాలస్వామి గుడికి వస్తానని ఆయన మొక్కుకున్నాడు. అందుకే ప్రస్తుతం మొక్కు తీర్చుకొని అక్కడే ఉన్నాడు. సతీమణి రమా రాజమౌళితో కలిసి కర్ణాటకలోని బందీపూర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ చూస్తున్నాడు. అటవీ శాఖాధికారుల సహకారంతో జక్కన్న అడవిలో పర్యటించాడు. కూడా అంతకు ముందుగానే అక్కడికి సమీపంలోని హిమవద్ గోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఎలాగూ సమయం ఉంది కదా అని అటవీ ప్రాంతాన్ని సందర్శించాడు రాజమౌళి. మరో నెల రోజుల్లో ట్రిపుల్ ఆర్ షూటింగ్ మొదలు కానుంది. 

More Related Stories