అదిరిపోయిన రాజమౌళి స్ట్రాటజీ.. డేట్స్ మ్యాజిక్ ఏంటో..  Rajamouli RRR
2019-11-22 19:48:49

రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరో ఏడాది వరకు కూడా ఇదే మాయలో ఉంటాడు జక్కన్న. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. దాంతో అన్నింటిని బ్యాలెన్స్ చేసే పనిలో ఉన్నాడు దర్శకధీరుడు. పైగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని అప్ డేట్స్ కూడా ఇచ్చాడు రాజమౌళి.

ఇందులో ఎన్టీఆర్ కు జోడిగా ఒలివియా మోరిస్ నటిస్తుంది. ఇక విలన్స్ గా హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్సన్.. అలిసన్ డూడీ నటిస్తున్నారు. ఈ ఇద్దరు హాలీవుడ్ లో బడా సినిమాల్లో నటించారు. వాళ్లను తీసుకొచ్చి మన సినిమాలో భాగం చేసాడు రాజమౌళి. చారిత్రాత్మక నేపధ్యం ఉన్నప్పటికీ ఇది ఫిక్షన్ సినిమానే అని చెప్పాడు దర్శక ధీరుడు. ఇది ఎలాంటి చరిత్ర కాదని.. తాము ఊహించుకుని రాసుకుంటున్న కథ అని తేల్చేసాడు ఈయన. బ్రిటిష్ నటీనటులకు చోటు ఉండటంతో ఇద్దరు స్టార్స్ ను తీసుకొచ్చారు. ఈ సినిమాకు 300 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టిస్తున్నాడు రాజమౌళి.

ఇదిలా ఉంటే సినిమా అప్ డేట్స్ చెప్పడంలో కూడా ఓ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ఈయన. ముఖ్యంగా నవంబర్ 18, 2017న రామ్ చరణ్, ఎన్టీఆర్ తో రాజమౌళి ఫోటో షేర్ చేసాడు.. ఆ తర్వాత సరిగ్గా ఏడాదికి అంటే నవంబర్ 19, 2018న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇక ఇప్పుడు మరో ఏడాదికి అంటే నవంబర్ 20, 2019న సినిమాలోని హాలీవుడ్ స్టార్స్ ను పరిచయం చేశాడు. ఏడాది గ్యాప్ ఇస్తూ సినిమా అప్ డేట్స్ ఇస్తున్నాడు రాజమౌళి. మరి ఈ డేట్స్ స్ట్రాటజీ ఏంటో అర్థం కావడం లేదు. సినిమా జులై 2020లో విడుదల కానుంది. 

More Related Stories