షాకిస్తోన్న ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్rrr
2020-02-09 17:05:17

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు ప్యాన్ ఇండియన్ సినిమా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి సిరీస్‌ తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీరఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లను తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఇరువురు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమరం భీంగా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ లాంటివి కూడా రిలీజ్ కాలేదు, కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆకాశాన్ని తాకే రేంజ్ లో ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే పూర్త‌య్యింద‌ట‌. నైజామ్ ఏరియాలో దిల్ రాజు రూ.75 కోట్లు, సీడెడ్‌లో వారాహి సంస్థ రూ.40 కోట్లు, వైజాగ్‌లో రూ.24 కోట్లకి దక్కించుకున్నట్టు సమాచారం. ఇక వెస్ట్ గోదావరి 14 కోట్లు, నెల్లూరు 9కోట్లు, కృష్ణా 15 కోట్లు, కన్నడలో 50 కోట్లకి హ‌క్కుల‌ను అమ్మేసినట్టు చెబుతున్నారు. ఇక శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్‌కు భారీ ధ‌ర ద‌క్కనుంద‌ట‌.

More Related Stories