రాజ‌శేఖ‌ర్ గోపీచంద్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్



 Rajasekhar Gopichand
2021-05-15 17:39:56

టాలీవుడ్ లో ప్ర‌స్తుతం మ‌ల్టీస్టార‌ర్ ల జోరు న‌డుస్తోంది. ఇప్ప‌టికే వెంక‌టేష్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా వ‌చ్చిన ఎఫ్ 2 మ‌ల్టీస్టారర్ సూపర్ హిట్ గా నిలిచింది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉండ‌గా ప‌వ‌న్ రానా కాంబినేష‌న్ లో అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ తెర‌కెక్కుతోంది. అంతే కాకుండా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో ఎన్టీఆర్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెర‌కెక్కుతోంది. మ‌రోవైపు చ‌రణ్ చిరంజీవి ఆచార్య సినిమాలో క‌లిసి న‌టిస్తున్నారు. 

అయితే తాజాగా మ‌రో మ‌ల్టీస్టార‌ర్ తెర‌పైకి వ‌చ్చింది. మ్యాచో మ్యాన్ గోపీచంద్-రాజ‌శేఖ‌ర్ కాంబినేష‌న్ లో ఓ మ‌ల్టీస్టార‌ర్ రాబోతుంద‌ని టాక్ వినిపిస్తోంది.  ఈ చిత్రాన్ని లౌక్యం, ల‌క్ష్యం, డిక్టేటర్ లాంటి చిత్రాల‌ను తెరకెక్కించిన శ్రీవాస్ తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌. ఇప్టటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ప్రారంభ‌మ‌య్యాయ‌ట‌. అంతే కాకుండా ఓ వ్యాపారవేత్త ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నార‌ట‌. అయితే ఇది టాక్ మాత్ర‌మే దీనిపై త్వ‌ర‌లోనే అషీషియ‌ల్ అనౌన్స్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండ‌గా గోపిచంద్ హీరోగా న‌టించిన సీటీమార్ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సిఉంది. కానీ క‌రోనా సెకండ్ వేవ్ కారణంగా విడుద‌ల వాయిదా ప‌డింది. ఇక రాజ‌శేక‌ర్ ప్ర‌స్తుతం శేక‌ర్, మ‌ర్మాణువు అనే సినిమాలు చేస్తున్నారు. 
 

More Related Stories