పార్టీ పెట్టింది టికెట్లు అమ్ముకోవడానికి కాదురా.. చిరంజీవికి రాజశేఖర్ పంచ్..Rajasekhar
2020-02-29 22:21:37

తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు.. తాము మంచి స్నేహితులుగా మారిపోయాము అంటూ ఎప్పటికప్పుడు మీడియా ముందు చెబుతూనే ఉంటారు రాజశేఖర్, చిరంజీవి. కానీ లోపల మాత్రం వాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం దాగివుంది. ఇది మరో సారి ప్రూవ్ అయింది కూడా. నిజానికి చిరంజీవి వైపు నుంచి రాజశేఖర్ కు ఎప్పుడు సెటైర్లు ఉండవు. కానీ రాజశేఖర్ మాత్రం చిరంజీవిని టార్గెట్ చేస్తూనే ఉంటాడు. ఈ మధ్యే మా అసోసియేషన్ డైరీ లాంచ్ ఈవెంట్ లో కూడా రాజశేఖర్, చిరంజీవి మధ్య మాటల యుద్ధం జరిగింది. 

ఈ వేడుకలో సినిమా పెద్దలను ఉద్దేశించి రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇండస్ట్రీలో చాలా తప్పులు జరుగుతున్నాయని.. కనీసం వాటిని వేలెత్తి చూపించడానికి.. నోరెత్తి అడగడానికి కూడా ఎవరికీ ధైర్యం సరిపోవడం లేదు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి చిరంజీవి కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. చెడు ఉంటే చెవిలో చెప్పుకోవాలి.. మంచి ఉంటే మైక్ లో మాట్లాడుకోవాలి అంటూ ఆయన తనదైన శైలిలో రాజశేఖర్ పై కామెంట్ చేశాడు. ఇలాంటి క్రమశిక్షణారాహిత్యం ఉన్న వాళ్ళ పై చర్యలు తీసుకోవాలంటూ మా అసోసియేషన్ కు చిరంజీవి ఫిర్యాదు కూడా చేశాడు. ఆ తర్వాత ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా చేశాడు. 

ఇదిలా ఉంటే రాజశేఖర్ నటించిన అర్జున ట్రైలర్ విడుదలైంది. ఎప్పుడో రెండు మూడేళ్ల కింద పూర్తయిన ఈ సినిమాను ఇప్పుడు నట్టికుమార్ విడుదల చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ లో రాజశేఖర్ చెప్పిన ఒక్క డైలాగ్ సంచలనం సృష్టిస్తుంది. పార్టీ పెట్టింది టికెట్లు అమ్ముకోవడానికి.. ఓడిపోగానే మూసుకోడానికి కాదురా.. నీలాంటి వెదవల తాట తీయడానికి అంటూ తాజాగా ఈ ట్రైలర్ లో రాజశేఖర్ చెప్పిన డైలాగ్ చిరంజీవికి సూటిగా తగులుతుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ డైలాగ్ వైరల్ అవుతుంది. చిరంజీవిని విమర్శించడానికి ఈ డైలాగ్ రాజశేఖర్ కావాలని పెట్టాడు అంటూ అభిమానులు మండిపడుతున్నారు. 

పదేళ్ల కింద చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన టికెట్లు అమ్ముకున్నాడు అంటూ విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఓడిపోగానే కాంగ్రెస్ లో ఆయన పార్టీని విలీనం చేశాడు. ఇప్పుడు అచ్చంగా రాజశేఖర్ ఇదే డైలాగ్ తన సినిమాలో చెప్పేసరికి చిరంజీవిపై ఈయనకు ఉన్న కోపం మరోసారి బయటపడింది. మార్చి 6న అర్జున సినిమా విడుదల కానుంది.

More Related Stories