మా ఎగ్జిగ్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన రాజశేఖర్..Rajasekhar
2020-01-02 18:29:00

మీడియాలో మరోసారి మా అసోసియేషన్ వార్త అయిపోయింది. డైరీ లాంఛ్ అంటూ పిలిచి తమలో ఉన్న లోపాలను.. లోసుగులను బయటపెట్టుకున్నారు మా సభ్యులు. అందులో భాగంగానే హీరో రాజశేఖర్ చేసిన కమెంట్స్ కొత్త సంచలనాలకు తెరతీసింది. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు ఈయన సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మా డైరీ మీటింగ్ ఈయన మాటలు చేసిన రచ్చ మామూలుగా లేదు.. ఈయనపై చిరంజీవి, మోహన్ బాబు లాంటి సీనియర్ హీరోలు కూడా సీరియస్ అయ్యారు. దాంతో అక్కడ్నుంచి వెళ్లిపోయిన రాజశేఖర్.. మీటింగ్ జరిగిన తర్వాత మళ్లీ వచ్చాడు. అయితే ఇప్పుడు ఈయన సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మా ఎగ్జిగ్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసాడు ఈ హీరో. అధ్యక్షుడు నరేష్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా కూడా వినేలా కనిపించడం లేదు రాజశేఖర్. ఈ విషయానికి సంబంధించి రాజీనామా లేఖ కూడా విడుదల చేసాడు ఈ హీరో. మా అధ్యక్షుడు నరేష్ తీరును తప్పుబడుతూ ఈయన లేఖ సాగింది. ఆయన తీరుకు నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నట్లు అనౌన్స్ చేసాడు రాజశేఖర్. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా నరేష్.. వైస్ ప్రెసిడెంట్‌గా జీవిత ఉన్నారు.

More Related Stories