రాజేంద్ర ప్రసాద్ క్లైమాక్స్ మూవీ రివ్యూ Rajendra Prasad
2021-03-05 14:21:02

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడూ కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేస్తుంటారు. ఈనేపథ్యంలోనే ఒక కొత్త కథ క్లైమాక్స్ తో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాలో సాషా సింగ్, శ్రీ రెడ్డి లు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈనేపథ్యంలో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్లైమాక్స్ అంచనాలను రీచ్ అయ్యిందా లేదా ఇప్పుడు చూద్దాం.

కథ కథనం : సినిమాలో విజయ్ మోడీ (రాజేంద్రప్రసాద్) తాను ఎదిగేందుకు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడని స్వభావం గలవాడు. ఓ మంత్రికి బినామిగా ఉన్న విజయ్ మోడీ బ్యాంక్ నుండి రుణం తీసుకుని ఒక బడా పారిశ్రామిక వేత్తగా మారిపోతాడు. విలాసవంతమైన జీవితాన్ని గడిపి చివరకు హత్యకు గురవుతారు. అయితే మోడీ ని ఎవరు చంపారు. ఎందుకు చంపారు. మోడీ బినామిగా ఉన్న మంత్రి ఏం చేసాడన్నదే సినిమా కథ. క్లైమాక్స్ సినిమా నిడివి కేవ‌లం గంట‌న్న‌ర మాత్రమే ఉంటుంది. థ్రిల్ల‌ర్ సినిమాల నిడివి అంత కంటే ఎక్కువ‌గా ఉంటే బోర్ కొడుతుంతేమోన‌ని భావించిన ద‌ర్శ‌కుడు లెంతీగా కాకుండా చూసుకున్న‌ట్టు అనిపిస్తుంది. థ్రిల్ల‌ర్ జోన‌ర్ సినిమాల‌కు ఎప్పుడూ ఒక బెనిఫిట్ ఉంటుంది.  సినిమాలో ట్విస్ట్ ల‌ను ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు అంద‌కుండా చూసుకుంటే చాలు...సినిమాకు మంచి టాక్ వ‌స్తుంది.  ఇదే పాయింట్ ను ద‌ర్శ‌కుడు భ‌వాని శంక‌ర్ కూడా ప‌ట్టుకున్నారు. ఈ సినిమా క‌థ‌ను ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వ‌ర‌కూ బిగి స‌డ‌ల‌కుండా ద‌ర్శ‌కుడు న‌డిపించాడు. ఇక సినిమా మొత్తం గంట‌న్న‌ర ఉండ‌గా ఫ‌స్ట్ హాఫ్ కొంత బోర్ కొట్టిన‌ట్టు అనిపిస్తుంది. విజ‌య్ మోడీ పాత్ర‌ను ఇంట్ర‌డ్యూస్ చేయ‌డానికే ఎక్కువ స‌మ‌యం కేటాయించిన‌ట్టు అనిపిస్తుంది. అంతే కాకుండా ఫ‌స్ట్ హాఫ్ లో సాదార‌ణ స‌న్నివేశాలు ఇబ్బంది పెడ‌తాయి. సెకండ్ ఆఫ్ లో సినిమా మ‌ళ్లీ ప‌ట్టాలెక్కుతుంది. దాంతో సెకండ్ హాఫ్ లోనే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది.

ప‌ర్ఫామెన్స్ లు :

విభిన్న పాత్ర‌ల్లో న‌టించి అల‌రించ‌డంలో రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇప్టటికే త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు విజ‌య్ మోడీ పాత్రలోనూ ఆయ‌న జీవించేసి మంచిమార్కులు కొట్టేశారు. సినిమాలో వివాదాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి త‌న రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ నే పోశించి ఫ‌ర్వాలేద‌నిపించ‌కుంది. ఆమె పాత్ర‌కు త‌క్కువ స‌మ‌యం కేటాయించ‌డంతో పూర్తిగా నిరూపించుకోలేక‌పోయింది. సాషా సింగ్‌, పృధ్వీ రాజ్‌, శివ శంక‌ర్ మాస్ట‌ర్ త‌మ ప‌త్ర‌ల‌కు న్యాయం చేశారు. సినిమాకు సంగీతం అందించిన రాజేశ్ నిద్వాన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.  సినిమా నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి. ర‌వికుమార్ నీర్ల చాయా గ్ర‌హ‌ణం సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. మొత్తంగా చూసుకుంటే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా వ‌చ్చిన క్లైమాక్స్ సినిమా ఫ‌ర్వాలేద‌నిపించింది. సస్పెన్స్ ను ఇష్ట‌ప‌డేవారికి ఈ సినిమా న‌చ్చుతుంది. ఒక సారి చిత్నాన్ని చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

ప్ల‌స్ లు మైన‌స్‌లు :

రాజేంద్ర ప్ర‌సాద్ న‌ట‌న‌, క్లైమాక్స్ లో సస్పెన్స్ స‌న్నివేశాలు సినిమాకు ప్ల‌స్ గా నిలిచాయి. ఇక ఫ‌స్ట్ హాఫ్ లో సాధార‌ణ కామెడీ విజ‌య్ మోడీ ఇంట్ర‌డ‌క్ష‌న్ కోసం ఎక్కువ స‌మయం తీసుకోవ‌డం మైన‌స్ గా నిలిచాయి. 
 

More Related Stories