రజినీకాంత్ నిర్ణయంతో డైలమాలో పడిపోయిన అభిమానులు..rajinikanth
2020-10-02 08:29:18

సూపర్ స్టార్ రజినీకాంత్ కేవలం హీరో మాత్రమే కాదు.. ఆయన అభిమానులకు దేవుడు కూడా. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అభిమానులు వెంటే ఉంటారు. కానీ తొలిసారి రజినీకాంత్ తీసుకున్న డిసిషన్ తప్పు అంటున్నారు ఫ్యాన్స్. మీరు మాట మార్చకపోతే కచ్చితంగా మేము మీ ఇంటి ముందు ధర్నా చేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. మాకు సినిమాలు చేయకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం మాత్రం వెంటనే వెనక్కి తీసుకోండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతగా రజినీకాంత్ ఏ నిర్ణయం తీసుకున్నాడు అనుకోవచ్చు.. చాలా సింపుల్ ఆయన మళ్లీ సినిమా షూటింగులు చేయడానికి సిద్ధమవుతున్నాడు. అసలే ఇప్పుడు బయట కరోనా వైరస్ చంపేస్తుంది. అడుగు బయట పెడితే ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం కావడం లేదు. యువకులు అయితే పర్లేదు కానీ అరవై ఏళ్లు పైబడిన వాళ్లకు మాత్రం అనుకోని ఆపదలు వస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం. 

మొన్నటి వరకు మన కళ్ళముందు ఆరోగ్యంగా తిరిగిన ఆయన కరోనా వైరస్ బారినపడి 50 రోజులకు పైగా ప్రాణాలతో పోరాడి ఓడిపోయాడు. చివరికి ఒక గొప్ప లెజెండ్ ను ఇండియా పోగొట్టుకోవాల్సి వచ్చింది. అందుకే ఇకపై అలాంటి తప్పులు చేయకూడదు అని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ విషయంలోనే రజనీకాంత్ ను కూడా షూటింగ్ చెయ్యొద్దు అంటూ అడ్డుకుంటున్నారు. ఇన్నాళ్లు ఈయన కూడా షూటింగ్ చేయకూడదని అనుకున్నా కానీ అక్టోబర్ 15 నుంచి హైదరాబాదులో జరగబోయే కొత్త షెడ్యూల్ లో అడుగుపెడుతున్నాడు సూపర్ స్టార్. శివ ఈ సినిమాకు దర్శకుడు. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్ కు తన సొంత కారులో రానున్నాడు సూపర్ స్టార్. అక్టోబర్ 8న హైదరాబాద్ వచ్చి వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి యూనిట్ అందరికీ నెగిటివ్ వచ్చిన తర్వాత షూటింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాడు రజినీకాంత్. ఈ సినిమాకు అన్నాతే టైటిల్ ఫిక్స్ చేశారు. నయనతార, కీర్తి సురేష్, మీనా, కుష్బూ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ ఇంట్రడక్షన్ సాంగ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడటం విశేషం. ఆయన రికార్డు చేసిన చివరి పాట ఇదే. 

More Related Stories