ర‌జినీమానియా.. ర‌జినీ ఫ్యాన్స్‌కు ఫెస్టివ‌ల్ డ‌బుల్ ఢ‌మాకా!



Rajinikanth
2021-09-10 10:15:46

తమిళ చిత్ర పరిశ్ర‌మ‌లో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కు ఉన్న క్రేజ్ మామూలు కాదు. సూపర్‌స్టార్ రజనీకాంత్. స్టైల్‌కి, హీరోయిజంకి కేరాఫ్ అడ్రస్. ఆయన అభిమానుల గురించి ఎంత చెప్పిన త‌క్కువే. ర‌జీనీ నుంచి ఏదైనా ఓ అప్డే వ‌స్తే..  అభిమానుల హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది.  ఆయ‌న సినిమా రిలీజ్ ఉన్నంటే చాలు.. అభిమానుల సంబురాలు అంబ‌రాన్ని అంటుతాయి.  కొన్ని కార్యాలయాలు సెలవులు కూడా ప్రకటిస్తాయి. ర‌జినీ క్రేజ్ దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. 

అయితే రజనీకాంత్ నుంచి సినిమాలు రాక చాలా రోజులవుతుంది. చివరిగా ‘దర్బార్’ అనే సినిమాతో ప్రేక్షకులను అల‌రించారు. అటు రాజ‌కీయాలు, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో సినిమాకు దూరమ‌య్యారు. ఆరోగ్యం కొద్ది తేరుకున్న‌గా .. కరోనా సమయంలో అన్నాత్తె సినిమా షూటింగ్ జరిపారు. కానీ చిత్ర‌యూనిట్లో కొంత‌మందికి క‌రోనా సోక‌డం. ఆ స‌మ‌యంలోనే ర‌జినీ కాంత్ ఆరోగ్యం క్షీణించ‌డంతో అన్నాత్తె చిత్ర నిర్మాణం మూల‌న ప‌డింది. అలా దర్శకుడు శివకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.   ఈ చిత్రం నుంచి  త్వ‌ర‌లో అప్డేట్ రానున్న‌ట్టు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో తెలుస్తుంది.  

వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ర‌జనీ కాంత్ త‌న అభిమానుల‌కు  ఓ తీపి వార్త చెప్ప‌నున్న‌ట్టు తెలుస్తుంది.   అన్నాత్తె చిత్రం నుంచి రెండు అప్డేట్లు రాబోతోన్నాయని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.శుక్ర‌వారం తొలుత ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి.. అనంత‌రం సాయంత్రం మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.  అంటే.. ఉదయం పదకొండు గంటలకు ఫస్ట్ లుక్, సాయంత్రం ఆరుగంటలకు మోషన్ పోస్టర్ విడుద‌ల కానున్నది.  ఇక ఈ సినిమాలో కుష్బూ, మీనా, కీర్తి సురేష్ వంటి వారు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన ర‌జినీ ఫ్రీ లుక్ నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది. ఈ వార్త విన్న‌ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అన్నాత్తె సెలెబ్రేషన్స్‌లో మునిగిపోయారు.

More Related Stories