ర‌జినీ రాజ‌కీయాల‌కు అందుకే దూరంగా ఉన్నారా



Rajinikanth
2021-05-04 17:45:26

తమిళ‌నాడు రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతార‌ని భావించిన ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి రావ‌డంలేద‌ని త‌ప్పుడ‌కున్నారు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. కానీ ఇప్పుడు మాత్రం ర‌జినీ అభిమానులు హ్యాపీగా ఉన్నార‌ట‌. ఆదివారం త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ఫ‌లితాల్లో డీఎంకే స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల్లో డీఎంకే 131 స్థానాల్లో గెలిచి స‌త్తా చాటింది. దాంతో త‌మిళ‌నాడు సీఎం కుర్చిని స్టాలిన్ కైవసం చేసుకున్నారు. 

ఇక అన్నా డీఎంకే ప్ర‌తిప‌క్ష హోదాతో స‌రిపెట్టుకుంది. ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపుతార‌ని భావించిన న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కు చేదు అనుభ‌వం మిగింలింది. ఆయ‌న పోటీ చేసిన స్థానంతో పాటు భ‌రిలోకి దిగిన అన్ని స్థానాల్లోనూ పార్టీ ఓట‌మి పాలైంది. ఈ సీన్ చూసిన త‌ర్వాత త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి దిగ‌కపోవ‌డ‌మే మంచిందైంద‌ని ర‌జినీ అభిమానులు అనుకుంటున్నార‌ట‌. మ‌రోవైపు ముందుగానే ర‌జినికాంత్ జ‌ర‌గ‌బోయేది ఊహించిన రాజ‌కీయ‌ల‌కు దూరంగా ఉండాల‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు కూడా తెలుస్తుంది. 

ఒక వేళ రజినీకాంత్ ఎన్నిక‌ల్లో పోటీ చేసినా కూడా ప‌రిస్థితులు ఇలానే ఉండేవ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు. అంతే కాకుండా చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం సినిమాలు ఒక్క‌సారిగా ప‌క్క‌న పెట్టి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌గా చేదు అనుభ‌వాల‌ను ఎదురుకున్నారు. అంతే కాకుండా ఒక‌ప్ప‌టిలాగా ప్ర‌జ‌లు కూడా ఇప్పుడు హీరోల‌ను స్వీక‌రించే ప‌రిస్థితులు క‌నిపించ‌డంలేదు. ఇవ‌న్నీ ముందుగానే ఊహించిన ర‌జినీకాంత్ కావాల‌నే రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నార‌ట‌. ఏది ఏమైనా ర‌జినీదే మంచి నిర్ణ‌యమని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

More Related Stories