మరోసారి గోప్పమనసు చాటుకున్న రజనీకాంత్Rajinikanth
2019-08-30 14:05:39

సూపర్ స్టార్ రజినికాంత్ మరో సారి తాను రియల్ హీరో అనిపించుకున్నాడు. తనను హీరోను చేసిన నిర్మాతకు కోట్టి రూపాయలు పెట్టి ఇల్లు కొనిచ్చాడు రజనీకాంత్‌. రజనీకాంత్‌ తన కెరీర్ మొదట్లో విలన్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆసమయంలో ఆయనను హీరోగా పరిచయం చేసి భైరవ అనే సినిమాని నిర్మించారు అప్పట్లో ఫేమస్ రచయిత కలైజ్ఞానం. ఆ సినిమా రజనీకాంత్‌ జీవిత గమనాన్నే మార్చేసింది. అయితే అలాంటి సుపర్ స్టార్ ని చేసిన వ్యక్తి నివసించడానికి సొంతంగా ఒక ఇల్లు కూడా ఏర్పరచుకోలేకపోయారు. ఈ విషయాన్ని రెండు వారాల క్రితం కలైజ్ఞానంకు దర్శకుడు భారతీరాజా నేతృత్వంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో నటుడు శివకుమార్‌ పేర్కొన్నారు.  అంతేకాక కలైజ్ఞానంకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇల్లు కట్టించాలని విజ్ఞప్తి చేశారు. అదే కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రజనీకాంత్‌ ప్రభుత్వానికి ఆ అవకాశం ఇవ్వనని, తానే కలైజ్ఞానంకు ఇల్లు కట్టిస్తానని ఆరోజున మాట ఇచ్చారు. అంతే కాదు 10 రోజుల్లో అందుకు డబ్బును తాను అందిస్తానని చెప్పారు. దీంతో దర్శకుడు భారతీరాజా కలైజ్ఞానం కోసం ఒక ఇంటిని చూసినట్లు, ఆ ఇంటిని రజనీకాంత్‌ కొనుగోలు చేసి నిర్మాత కలైజ్ఞానంకు ఇచ్చినట్లు ప్రచారం మొదలయింది. అయితే నిజానికి రజనీకాంత్‌ గతంలో నటించిన అరుణాచలం సినిమాని తనతో సినిమాలు చేసి ఆ తరువాత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న ఏడుగురిని పార్టనర్స్ గా చేసి నిర్మించారు. ఆ పార్టనర్స్ లో నిర్మాత కలైజ్ఞానం కూడా ఉన్నారు.

More Related Stories