ర‌జినీకాంత్ లాంబోర్గినిలో వెళ్ళింది అక్కడికేRajinikanth
2020-07-25 01:46:40

త‌మిళ‌ సూప‌ర్‌ స్టార్ ర‌జినీకాంత్ మొన్న లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ...లాంబోర్గిని కారులో ఫేస్ మాస్కు పెట్టుకుని..సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్న ఫొటో ట్విట‌ర్ లో వైరల్ అయిన విష‌యం తెలిసిందే. అయితే ర‌జ‌నీకాంత్ సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లింది ఎక్క‌డికనే విషయం వెల్లడయింది. రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య ఈమధ్యే విశాగన్ వనంగమూడి అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సౌందర్యకు విశాగన్ కు ఇద్దరికీ ఇది రెండో వివాహమే. ఇక ర‌జ‌నీ కెలంబాక్క‌మ్ లోని త‌న ఫాంహౌజ్ కు వీరితో కలిసి వెళ్లారని తెలుస్తోంది. ఈ ఫాంహౌజ్లో కూతురు సౌంద‌ర్య‌, అల్లుడు విశాగ‌న్ వానంగ‌మూడి, మ‌న‌వ‌డు వేద్ కృష్ణ‌తో క‌లిసి దిగిన ఫొటో ప్ర‌స్తుతం నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌రోవైపు ర‌జ‌నీ ఫాంహౌజ్ లో స‌ర‌దాగా వాకింగ్ చేశారు. ర‌జ‌నీ వాక్ చేస్తున్న‌పుడు తీసిన వీడియో కూడా ఇప్పుడు ఆన్ లైన్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.  

More Related Stories