ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న రజినీ



Rajinikanth
2020-12-14 13:51:40

సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. రజినీ తో పాటు నయనతార కూడా హైదరాబాద్ చేరుకున్నారు. సూపర్ స్టార్ ప్రస్తుతం "అన్నాథే" అనే సినిమాలో నటిస్తున్నారు. సినిమాలో కీర్తి సురేష్ తో పాటు మరో భామ నయనతార కూడా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ కోసమే రజినీ హైదరాబాద్ చేరుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమాలోని కీలక సన్నివేశాలను హైదరాబాద్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, మీనా, కుష్బూ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇమ్మన్ సినిమాకు స్వరాలను అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 2021లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లో స్పెషల్ మూవీగా చెప్పవచ్చు. ఇతివాలం70 వసంతాలు పూర్తి చేసుకున్న రజినీ ఈ సినిమాను స్పెషల్ గా భావిస్తున్నారు. అంతే కాకుండా రజిని కాంత్ ఇటీవలే తన పొలిటికల్ పార్టీ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అన్నాథే సినిమాపై అంచనాలు పెరిగాయి. రజినీకాంత్ తన పొలిటికల్ కెరీర్ పై దృష్టి పెట్టడానికే సినిమాలను చకచకా పూర్తిచేయాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది.

More Related Stories