రాజకీయాల్లో మంచి వాళ్ళు లేరంటున్న రజినీకాంత్..Rajinikanth
2020-03-12 11:40:32

ఒకప్పుడు సినిమాల గురించి తప్ప రాజకీయాల గురించి అస్సలు ఆలోచించలేదు రజనీకాంత్. ఇప్పుడు ఈ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. రెండేళ్ల కింద రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ ఆ తర్వాత పార్టీకి సంబంధించిన ఏ పనులు కూడా ముందుకు జరపలేదు. వరుస సినిమాలు చేస్తూ రాజకీయాలకు పూర్తిగా దూరంగానే ఉన్నాడు రజనీకాంత్. మధ్య మధ్యలో అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడటమే తప్ప పూర్తిగా అటువైపు ఆలోచించింది లేదు. 

ఇక ఇప్పుడు మరోసారి మీడియా ముందుకు వచ్చిన రజనీకాంత్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. 1996కి ముందు తాను రాజకీయాల గురించి ఎప్పుడు ఆలోచించలేదని..  కానీ ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన కొన్ని పరిస్థితులు చూసిన తర్వాత రాజకీయాలపై ఆసక్తి కలిగింది అన్నాడు రజినీకాంత్. తన రాజకీయ రంగప్రవేశంపై ఈ మధ్యే మక్కళ్‌ మండ్రం జిల్లా కార్యదర్శులతో భేటీ అయిన రజనీకాంత్‌ తాజాగా హోటల్‌ లీలా ప్యాలెస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. అప్పటి వరకు సినిమాలు తప్ప మరో ప్రపంచం లేని రజినీకాంత్ రెండేళ్ళ కింద సడన్ గా ఒక పార్టీ మీటింగ్ పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించాడు. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో కూడా చెప్పాడు.

 తాను రెండేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వస్తానని తొలిసారి చెప్పానన్నారు. తనకు ఒక విషయంలో అసంతృప్తి ఉందని.. దానిపై ఎన్నో ఊహగానాలు ఉన్నాయని తెలిపాడు సూపర్ స్టార్. వాటిపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లు అభిమానులకు చెప్పాడు. తమిళనాడు రాజకీయాలను బాగా విశ్లేషించానన్నారు. మంచివాళ్లు రాజకీయాల్లోకి రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మంచితనం లేక పరిస్థితులు గాడి తప్పుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెబుతున్నాడు రజనీకాంత్. దీనికి త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది అంటున్నాడు.

More Related Stories