చైనాలో దుమ్ముదులపడానికి రెడీ అయిన రజనీ !Rajinikanth
2019-08-14 09:24:43

ఈ మధ్య కాలంలో భారత సినిమాలు విదేశాల్లో కూడా బాగా మార్కెట్ చేసుకుంటున్నాయి. మన దగ్గర సూపర్ హిట్ అయిన బాహుబలి లాంటి సినిమాలను జపాన్ చైనా వంటి దేశాలలో రిలీజ్ చేస్తే అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు అదే కోవలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అభిమానులు ఉన్న రజనీకాంత్ రోబో 2.0 సినిమా కూడా చైనా లో రిలీజ్ కి సిద్దం అవుతోంది. అది కూడా ఆషామాషీగా కాదండోయ్ ఏకంగా  47,000 కంటే ఎక్కువ థియేటర్స్ అది కూడా త్రీడీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. సెప్టెంబరు 6న ఈ సినిమా చైనాలో రిలీజ్ అవుతోంది. ఈ రేంజ్ లో చైనాలో రిలీజవుతున్న విదేశీ చిత్రం ఇప్పటి వరకు మరొకటి లేదని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్, హెచ్ వై మీడియాతో కలిసి 2.0 సినిమాని చైనాలో విడుదల చేస్తోంది. 

ఈ సినిమా భారత్ లో టాక్ పరంగా నెమ్మదించినా వసూళ్ళపరంగా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించారు. సెల్ ఫోన్ వాడకంతో ప్రకృతి వినాశనం మొదలవుతోందని ఎన్నో పక్షిజాతులు అంతరించిపోతున్నాయన్న మెసేజ్ తో ఈ మూవీ తెరకెక్కించారు. అప్పట్లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజైన చైనాలో మాత్రం రిలీజ్ కాలేదు. ఎప్పటి నుంచో బయ్యర్లు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా పలు కారణాల వలన ఆగింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని జూలై 12నే రిలీజ్ చేయాలని భావించినా, హాలీవుడ్ మూవీ లయన్ కింగ్ విడుదల నేపథ్యంలో వాయిదా వేశారు. ఇక మళ్ళీ ఇన్నాళ్ళకి డేట్ దొరికింది. రజినీకాంత్ కి భారత్ లోనే కాదు చైనా, జపాన్ లలో కూడా మంచి క్రేజ్ ఉంది.  ఈ చిత్రంలో రజనీకి జోడీగా అమీ జాక్సన్ నటించారు.

More Related Stories