ఆస్ప‌త్రిలా అన్నాత్తే లొకేష‌న్



Rajinikanth
2021-05-01 12:37:52

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా న‌టిస్తున్న అన్నాత్తే సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం చిత్రం యూనిట్ ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటుంది. గ‌తంలో ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో చిత్ర యూనిట్ లోని ప‌లువురు క‌రోనా బారిన ప‌డ్డారు. అంతే కాకుండా హీరో ర‌జినీ కాంత్ హైబీపీ కార‌ణంగా ఆస్ప‌త్రిలో చేరారు. అయితే ఇప్పుడు షూటింగ్ ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌కూడ‌ద‌ని చిత్ర యూనిట్ ఎన్నో జాగ్ర‌త్తలు తీసుకుంటుంది. 

ముఖ్యంగా ర‌జినీకాంత్ కోసం లోకేష‌న్ ను ఆస్ప‌త్రిలా మార్చేసింది. షూటింగ్ స‌మ‌యంలో చిత్ర ద‌ర్శ‌కుడు శివ తో పాటు ఎవ‌రైనా స‌రే ర‌జినీకి ప‌ది అడుగుల దూరంలో ఉండాల్సిందే. అయితే ర‌జినీతో సీన్ ఉన్న న‌టీన‌టులు మాత్రం సీన్ షూట్ అయ్యేవ‌ర‌కూ ఆయ‌న ప‌క్క‌న ఉంటారు. ఆ త‌రువాత వారు కూడా దూరంగా  ఉండాల్సిందే. అంతే కాకుండా సూప‌ర్ స్టార్ తో ఫోటోలు దిగేందుకు ప‌లువురు న‌టిన‌టులు యూనిట్ స‌భ్యులు ఉత్సాహం చూపిస్తారు. అయితే ర‌జినీతో ఫోటోలు దిగ‌టం కూడా నిషేద‌మ‌ట‌. అంతే కాకుండా అత‌డితో న‌టించే న‌టీన‌టులు త‌ప్ప మిగ‌తావారెవ‌రూ లొకేష‌న్ కు రాకూడ‌ద‌ట‌. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం మీనా న‌య‌న‌తార ర‌జినీకాంత్ ల‌తో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. 

More Related Stories